గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

గండ్రేడు గ్రామం / GANDREDU VILLAGE

శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి

కర్కాటకరాశి, ఆశ్రేష నక్షత్రం (3వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తరం దిశగా, సుమారు 20 kms. దూరాన గండ్రేడు గ్రామం (Gandredu) కలదు.  రామచంద్రపురం - సామర్లకోట రోడ్డు మార్గములో గొల్లల మామిడాడ జంక్షన్ ఉంటుంది. గొల్లల మామిడాడ జంక్షన్ కు దక్షిణ-ఆగ్నేయం దిశగా సుమారు 2.8 Kms. దూరంలో గండ్రేడు గ్రామం ఉంటుంది. క్షేత్రం నందు శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: గండ్రేడు గ్రామం లోని శ్రీ ఉమా సమేత  శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది.  ఆలయ ప్రవేశం పశ్చిమ గాలిగోపురం క్రింద నుంచి జరుగుతుంది.  ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, నాగ బంధం, ప్రధానాలయం, చండీశ్వరుడు, తులసికోట మొదలగునవి ఉంటాయి.  ముఖమండపం నందు నందీశ్వరుడు, ద్వారపాలకులు, శ్రీ ఉమా దేవి సన్నిధి కలవు. అమ్మ వారి సన్నిధి దక్షిణాభిముఖంగా  ఉంటుంది. అంతరాలయం విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తారు. గర్భాలయం నందు శ్రీ సోమేశ్వర లింగము దర్శనమిస్తాంది.  ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం ఫాల్గుణ శుద్ద ఏకాదశి నాడు జరుగుతుంది.

మహాశివరాత్రి నాడు విశేష అభిషేకాలు ఉంటాయి. అర్ధరాత్రి లింగోద్భవం కార్యాక్రమం జరుపుతారు. మహాశివరాత్రి  సందర్భముగా  నాలుగు జాములు ఆలయ దర్శనం జరుగుతుంది. మహాశివరాత్రి నాటి సాయంత్రం దీపోత్సవం జరుగుతుంది. శరన్నవరాత్రులు జరుగుతాయి.

అన్నపూర్ణ దేవి అవతారం సందర్భముగా అమ్మ వారిని కూరగాయలతో  'శాకంబరి' దేవిగా అలంకరించుతారు. మరసటి రోజు ఆ కూరగాయలతో వంటలు తయారుచేసి, భక్తులుకు అన్నదానం (కదంబాన్ని) జరుపుతారు. కార్తీక మాసంలో విశేష పూజలు ఉంటాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణము జరుపుతారు. ధనుర్మాసం నందు' తీర్ధ బిందె ' కార్యక్రమం ఉంటుంది.  ధనుర్మాసం (30 రోజులు) నందు గ్రామ ఊరేగింపు కార్యక్రమం జరుగుతాయి.  సుబ్బారాయుడు షష్ఠి వేడుకులు వైభవంగా జరుగుతాయి. ప్రతి నెల మాస శివరాత్రి పూజలు జరుగుతాయి.  భీష్మా ఏకాదశి నాడు వార్షికోత్సవం వేడుకులు జరుగుతాయి. ఆలయ పూజ సమాచారం కోసం ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కొమాళ్ళపల్లి వీరభద్రం, సెల్ నెం. 9949139638 గారిని  సంప్రదించగలరు.

శ్రీ భీమేశ్వర లింగము, ఆశ్రేష నక్షత్రం (3వ పాదం) చెందినది. ఆశ్రేష నక్షత్రం నందలి 3వ పాదము లో జన్మంచిన శిశువు వలన తల్లికి దోషం కలుగను. ఆలయం నందు ఆశ్రేష నక్షత్రం (3వ పాదం) నందు జన్మించిన వారికి అభిషేక శాంతులు నిర్వహించుతారు.

నక్షత్ర శాంతి కోసం ఆలయ అర్చక స్వామి: శ్రీ కొమాళ్ళపల్లి వీరభద్రం, సెల్ నెం. 9949139638 సంప్రదించగలరు.

రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 8 kms. దూరంలో రామచంద్రాపురం bus complex ఉంటుంది. ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురం కు బస్సులు / ఆటోలు దొరుకుతాయి.

రవాణా సమాచారం 2: రామచంద్రాపురం బస్ స్టాండ్ నుంచి సామర్లకోట బస్సులు ప్రతి గంటకు ఉంటాయి. బస్ సర్వీసులు చోడవరం, గొల్లల మామిడాడ, బిక్కవోలు మీదగా ప్రయాణం చేస్తాయి.

రవాణా సమాచారం 3: గొల్లల మామిడాడ జంక్షన్ (గాంధీ బొమ్మ సెంటర్) నుంచి గండ్రేడు శివాలయం నకు ఆటోలు దొరుకుతాయి. ఆటోలు రాను - పోను ఏర్పాట్టు చేసుకోవడం సౌక్యముగా ఉంటుంది. గొల్లల మామిడాడ - గండ్రేడు శివాలయం మధ్య దూరం సుమారు 3 Kms. గా ఉంటుంది.

రవాణా సమాచారం 4: కాకినాడ - గొల్లల మామిడాడ ఆటోలు (via) ఇంద్రపాలెం, కొవ్వాడ, రామేశ్వరం  పెదపూడి మీదగా ఉంటాయి. కాకినాడ - గొల్లల మామిడాడ మధ్య దూరం 20 Kms. గొల్లల మామిడాడ ఆటోలు కాకినాడ బాల చెరువు నుంచి బయలుదేరుతాయి.  పెద్ధాడ తర్వాత గండ్రేడు జంక్షన్ వస్తుంది. దీనినే చర్చి సెంటర్ అని కూడ పిలుస్తారు. ఇక్కడ నుంచి సుమారు 01 Km. దూరంలో గండ్రేడు శివాలయం ఉంటుంది.

గండ్రేడు గ్రామం నకు సమీప రైల్వే స్టేషన్స్ సామర్లకోట జంక్షన్.

రవాణా సమాచారం 5: విశాఖపట్నం - విజయవాడ రైలు మార్గములో  సామర్లకోట జంక్షన్ అను రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ అన్ని ముఖ్య రైలు సర్వీసులు ఆగుతాయి. సామర్లకోట రైల్వే స్టేషన్ కు ఎదురుగా APSRTC బస్ స్టాండ్ ఉంటుంది.

రవాణా సమాచారం 6: సామర్లకోట నుంచి రామచంద్రపురం కు (via) బిక్కవోలు, గొల్లల మామిడాడ గ్రామం మీదగా బస్సులు బయులు దేరుతాయి. సామర్లకోట - గొల్లల మామిడాడ మధ్య దూరం 22 Kms. గొల్లల మామిడాడ గాంధీ బొమ్మ సెంటర్ నుంచి గండ్రేడు శివాలయం నకు ఆటోలు దొరుకుతాయి.

మాకు సహకరించిన గండ్రేడు శివాలయం నివాసి శ్రీ కొమాళ్ళపల్లి సూర్యనారాయణ మూర్తి శర్మ, సెల్ నెం. 9949139638 గార్కి నా నమసుమాంజలి.

గండ్రేడు గ్రామం లో నేరేళ్ళమ్మ గ్రామదేవత జాతర ఉత్సవములు వైశాఖ బహుళ అమావాస్య రోజున వైభవంగా జరుగుతాయి. గండ్రేడు పరిసర ప్రాంతాలలో రైతులు వైశాఖ బహుళ అమావాస్య నుంచి, తమ వ్యవసాయం పాలేర్లకు (కమతాలు కుదిరిన) జీతాలు గుణించుతారు (లెక్కకడతారు). వైశాఖ బహుళ అమావాస్యను 'గండ్రేడమాస' అని అంటారు.

గండ్రేడు గ్రామం లో  " గౌరీదేవి సంబరం " చాల వైభవంగా ఉంటుంది. ఇది ఒక మాసం పాటు జరుగుతుంది. దీనిని గండ్రేడు గ్రామం నకు చెందిన సానపతుల (పద్మసాలి) కులము చెందిన ఒక కుటుంబం నిర్వహించుతారు. ఆశ్వీయుజ మాసం నందలి బహుళ తదియ (అట్లతద్ది) నాడు ఒక మట్టి బొమ్మకు రంగులు అద్ది ఊరేగింపుగా గౌరీదేవి గుడికి తెచ్చి, నెల రోజులు పాటు ఆర్చనలు చేస్తారు. ప్రతి ఇంటి నుంచి ఒక పచ్చి అరటి పళ్ళు గెలను గౌరిదేవికి సమర్పించుట ఆచారంగా ఉంది. గౌరీదేవి గుడిలో ఒక శిల పైన శివ కుటుంబం చూడగలం. శివుడు, పార్వతి దేవి (గౌరి దేవి), గణపతి ఉంటారు.

ఆలయ అర్చక వాటాదారులు:

1. శ్రీ కొమాళ్ళపల్లి వీరభద్రం, సెల్ నెం. 9949139638

2. శ్రీ కొమాళ్ళపల్లి అక్కయ శాస్రి, సెల్ నెం. 8790886711

3. శ్రీ కొమాళ్ళపల్లి సుబ్రహ్మణం, నెం. 9849951712

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.  దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

ఆశ్లేష నక్షత్రం స్తోత్రం

నమోస్తు సర్వేభ్యో యేకేచ పృధివీభను: యే అంతరిక్షే|

యే దివి తేభ్య: సర్వేభ్యో నమ:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.