గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

పొలమూరు గ్రామం / POLAMURU VILLAGE

శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి

సింహరాశి, పుబ్బ నక్షత్రం (4వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 21 kms. దూరాన, తుల్యాభాగ నదీ తీరం నకు దక్షిణ భాగంలో పొలమూరు  (Polamuru) అను గ్రామం కలదు. పెడపర్తి రేవు - అనపర్తి రోడ్డు మార్గములో పొలమూరు గ్రామం ఉంటుంది. పొలమూరు మెయిన్ రోడ్డుకు తూర్పు దిశగా సుమారు 0.5 Kms. లోపలకి శివాలయం ఉంటుంది. ఇచ్చట శ్రీ రామలింగేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ రామలింగేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: పొలమూరు గ్రామం లోని శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. దేవాదాయ శాఖ మరియు గ్రామస్ధుల ఆర్ధిక సహాయంతో ఆలయంను బహు సుందరంగా నిర్మించారు. 2015 సంవత్సరములో పునః ప్రతిష్ట జరిగింది.  ఆలయ ప్రాంగణము విశాలముగా ఉంటుంది. నాలుగ వైపుల ప్రవేశ ద్వారములున్నాయి. ప్రధానాలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయం నకు పశ్చిమ వైపున మూడు అంతస్ధుల గాలి గోపురం ఉంటుంది. ఆలయం ప్రవేశం గాలి గోపురం క్రింద నుంచి జరుగుతుంది. ఆలయం ప్రాంగణము లోనికి ప్రవేశించగానే ధ్వజస్ధభం, బలి పీఠం, ప్రధానాలయం దర్శనమిస్తాయి.

ఆలయం ప్రాంగణము నందు యాగ శాల, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, కాల భైరవ స్వామి, చండీశ్వర స్వామి, చక్కటి తులసి కోట ఉంది. కోటకి అష్ట లక్ష్మి మూర్తులు పొదిగి ఉన్నాయి. ఈశాన్య మూల నవగ్రహ మండపం, తూర్పున వృద్ధ రామలింగేశ్వర స్వామి మొదలగు మూర్తులు కలరు. భక్తులు స్వయంగా శ్రీ వృద్ధ రామలింగేశ్వర లింగముకు అభిషేకాలు జరుపుతారు. ఉత్తర-ఈశాన్యం నందు కోనేరు ఉంది. ఇది ప్రస్తుతం జీర్ణావస్థలో ఉంది. ముఖ మండపం నందు మహా నందీశ్వరుడు, చిన్న నంది, ద్వారపాలకులు ఉంటారు. ముఖ మండపం నందు దక్షిణ భాగం నందు మేధా దక్షిణామూర్తి దర్శనం మిస్తారు. అంతరాలయం నందు మహా గణపతి, కుమార స్వామి, ఉత్సవ మూర్తులు కొలువైన్నారు. గర్భాలయం నందు  శ్రీ రామలింగేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామి వామ భాగం నందు  శ్రీ ఉమా దేవి కొలువుదీరింది. స్వామి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణం కార్తీక బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది. కార్తీక మాసం పౌర్ణమి నాడు జ్వాలాతోరణం జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి. మహాశివరాత్రి నాడు కోటిదీపోత్సవం మరియు మహా అన్నదానం నిర్వహించుతారు. సంక్రాంతి, దీపావళీ, సుబ్రహ్మణ్య షష్టి మొదలగు పర్వదినాలు సందర్భముగా పూజలు విశేషంగా జరుగుతాయి. ప్రతి మాసం మాస శివరాత్రి సందర్భముగా శాంతి కళ్యాణం భక్తుల చేత నిర్వహించబడును.

శ్రీ రామలింగేశ్వర లింగము, పుబ్బ నక్షత్రం (4వ పాదం) చెందినది. పుబ్బ నక్షత్రం నందలి 4వ పాదము లో జన్మంచిన వారి వలన తల్లికి దోషం కలుగును. పుబ్బ నక్షత్రం (4వ పాదం) నందు జన్మించిన వారికి ఆలయం నందు అభిషేక శాంతులు నిర్వహించుతారు.

రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నుంచి రాజమండ్రి బస్సులు (via)  రామచంద్రపురం, పెడపర్తి రేవు, మండపేట మీదగా ఉంటాయి.

రామచంద్రపురం - మండపేట రోడ్డు మార్గములో పెడపర్తి రేవు అను గ్రామం ఉంది. రామచంద్రపురం - పెడపర్తి రేవు మధ్య దూరం సుమారు దూరం 10 Kms.

రవాణా సమాచారం 2: పెడపర్తి రేవు నుంచి పొలమూరు గ్రామం నకు (via) కుతుకులూరు మీదగా ఆటోలు దొరుకుతాయి. పెడపర్తి రేవు నుంచి పొలమూరు గ్రామం దూరం సుమారు 08 Kms. గా ఉంటుంది.

రవాణా సమాచారం 3: కాకినాడ - రాజమండ్రి బస్సులు (via) అనపర్తి మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం 4: అనపర్తి వంతెన బస్సు స్టాప్ (దేవి చౌక్) నుంచి పొలమూరు కు ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 4 Kms.

రవాణా సమాచారం 5: పొలమూరు గ్రామం నకు సమీప రైల్వే స్టేషన్స్ అనపర్తి

రవాణా సమాచారం 6: విశాఖపట్నం - విజయవాడ రైలు మార్గములో  అనపర్తి రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ అన్ని ప్యాసింజర్ రైలు సర్వీసులుతో పాటు కొన్ని Express రైలుసర్వీసులు కూడ ఆగుతాయి.  అనపర్తి రైల్వే స్టేషన్ నుంచి అనపర్తి వంతెన బస్సు స్టాప్ దూరం సుమారు 0.5 Kms. వీటి మధ్య ఆటోలు దొరుకుతాయి. అనపర్తి వంతెన బస్సు స్టాప్ (దేవి చౌక్) నుంచి పొలమూరు కు ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 4 Kms.

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన పొలమూరు - శ్రీ రామలింగేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ యలమంచలి సతీష్ శర్మ, సెల్ నెం. 96186 59214 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

పుబ్బ నక్షత్రం స్తోత్రం

భగప్రాణోత్‌ భర్గ సత్య రాధో|

భగే మధియముదవాదదన్న భగయే ప్రణోజన యగోభి

రశ్వైర్భయ ప్రనృభి న్రై: వస్యామ్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.