గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

అయినవిల్లి గ్రామం / AINAVILLI VILLAGE

శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి

మకర రాశి, ధనిష్ఠ నక్షత్రం (2వ పాదం)


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా సుమారు 18 kms. దూరాన అయినవిల్లి (Ainavalli) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ విశ్వేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ధనిష్ఠ నక్షత్రం (2వ పాదం) చెందినది. శ్రీ విశ్వేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: అయినవిల్లి క్షేత్రము జగత్ప్రసిద్ధి చెందిన విఘ్నేశ్వర క్షేత్రం. విఘ్నేశ్వర స్వామి స్వయంభూ మూర్తి. విఘ్నేశ్వర స్వామి దక్షిణాభి ముఖంగా ఉంటాడు. విఘ్నేశ్వరాలయం నందు శ్రీ అన్నపూర్ణా దేవి (శక్తి), శ్రీ కేశవ స్వామి ( విష్ణు రూపాం), శ్రీ విఘ్నేశ్వర స్వామి (గణపతి), శ్రీ విశ్వేశ్వర స్వామి (శివ లింగము) మరియు శ్రీ కాల భైరవ స్వామి

అను అయిదు దేవతలు కొలువుదీరినారు. ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. శ్రీ విశ్వేశ్వర స్వామికి ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. శ్రీ విశ్వేశ్వర స్వామి తూర్పు అభిముఖంగా దర్శమిస్తాడు. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ విశ్వేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు నిర్వహించ బడతాయి. కనుమ రోజు ప్రభల తీర్థం ఉంటుంది.  మకర రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. 

రవాణా సమాచారం: రావులపాలెం - మురమళ్ళ బస్సులు  (Via) వాడపాలెం, వెలవలపల్లి, ముక్తేశ్వరం మీదగా ఉంటాయి.

* రావులపాలెం - ముక్తేశ్వరం మధ్య దూరం సుమారు 25 Kms.

* ముక్తేశ్వరం నుంచి అయినవిల్లి కి ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 2 Kms.

రవాణా సమాచారం: రావులపాలెం & కొత్తపేట నుంచి అయినవిల్లి కు షేరింగ్ ఆటోలు ఉంటాయి.

రవాణా సమాచారం: అమలాపురం - వీరవల్లిపాలెం బస్సులు (Via) ముక్తేశ్వరం మీదగా ఉంటాయి. అమలాపురం - ముక్తేశ్వరం మధ్య దూరం సుమారు 10 Kms. అమలాపురం నుంచి ముక్తేశ్వరం కు షేరింగ్ ఆటోలు కూడ ఉంటాయి.

రవాణా సమాచారం: కోటిపల్లి రేవు నుంచి ముక్తేశ్వరం రేవుకు Boat సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం రేవు నుంచి ముక్తేశ్వరం కు రవాణ సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం నుంచి అయినవిల్లి కి ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 2 Kms.

అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ అయినవిల్లి సత్తిబాబు శర్మగారు, సెల్ నెం : 94936 54137 & 94903 56448 (whatsup No.) సంప్రదించగలరు. శ్రీ అయినవిల్లి శివరామక్రిష్ణ, శ్రీ అల్లవరపు బాలసుబ్రమణ్యం & అల్లవరపు అన్నప్పసోమయాజులు గారు cell no. 94903 56445 ఇతర అర్చకస్వాములు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

ధనిష్ఠ నక్షత్రం స్తోత్రం

వసో: పవిత్రమసి శతధారం వసో: పవిత్రమసి సహస్రధారమ్‌|

దేవస్త్యా సవితా పునాత్‌ వసో: పవిత్రేణ శతధారేణ సుప్త్వా కామధుక్ష:

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Description