గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

ఇంజరం గ్రామం / INJARAM VILLAGE

శ్రీ ఉమాదేవి సమేత శ్రీ కృపేశ్వర స్వామి

మేషరాశి, భరణి నక్షత్రం (2వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 15 kms. దూరాన, ఇంజరం (Injaram) గ్రామం కలదు. ఇచ్చట శివాలయం వీధిలో శ్రీ ఉమా సమేత శ్రీ కృపేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. శ్రీ ఉమాకృపేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ ఉమా సమేత శ్రీ కృపేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైది. కాల క్రమములో గ్రామస్తులు, స్ధానిక తెలుగు పండితల సహాయంతో శివాలయం పునర్నార్మించారు. శివాలయం నందు పాత శివలింగాన్ని పునః ప్రతిష్ట చేసారు. ఆ శివలింగాన్ని శ్రీ కృపేశ్వర లింగముగా కొలుస్తారు. స్వామికి ఎడమ భాగములో శ్రీ ఉమాదేవి కొలువుదీరింది. శివాలయం నందు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చండీశ్వరుడు, నాగ బంధం మొదలగునవి దర్శించగలము. ఆలయ ప్రాంగణములో నవగ్రహ మండపం, రామ పంచాయతన మందిరం, ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం జ్యేష్టా శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి. సంక్రాంతి, దీపావళీ మొదలగు పర్వదినాలు సందర్భముగా పూజలు విశేషంగా ఉంటాయి.

పంచాయతన పద్ధతి అనగా పంచ భూతాల ఆరాధన. అదిత్యం (సూర్యడు), అంబిక (శక్తి), విష్ణుం ( విష్ణు రూపాం), గణనాధం (గణపతి), మహేశ్వరం (శివ లింగము) అను అయిదు దేవతలును కొలుచుటనే పంచాయతన ఆరాధనగా చెప్పుతారు. దీనిని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రవేశపెట్టారు. పంచాయతన ఆరాధనలో ఇష్టదైవంను మధ్యలో ఉంచుతారు.

ప్రాచీన ఆలయంను 17వ శతాబ్ధం నాటి అక్కన్న, మాదన్నలు నిర్మించినట్లుగా చెప్పుచుంటారు. వీరు గోల్కొండ సంస్థానం నకు చెందిన తానీషా చక్రవర్తి పాలనలో మంత్రులుగా పనిచేసిన అన్నదమ్ములు. శివాలయం కు దక్షిణ దిశగా సుమారు 01 Km. దూరంలో గోదావరి నది ప్రవాహం ఉంటుంది. గోదావరికి వరదలు వచ్చినప్పుడు నది ప్రవాహం పొంగి, ఆ నీరు గ్రామం లోనికి చేరేది. పల్లపు ప్రాంతములో శివాలయం ఉండుట వలన వరద నీరు, ఇంజరం గ్రామంలో పడ్డ వర్షపు నీరంతా పల్లపు ప్రాంతాలకు పారుతూ శివాలయ ప్రాంగణం నిండి పోయేది. దీని వలన గర్భాలయం లోనికి కూడ నీరు వచ్చేది. ఇది శ్రీ ఉమాకృపేశ్వర స్వామి పూజలకు మరియు భక్తుల సేవలకు ఇబ్భందిగా మారింది. భక్తుల ఇబ్భందులు తీర్చుటకు ప్రాంగణమును కొంత ఎత్తు చేసి శివాలయం పునర్నార్మించారు.

బ్రిటీషు పాలనలో ఇంజరం వాణిజ్యకేంద్రంగా అభివృద్ధి చెందింది. 1708లో బ్రిటీషువారు ఇంజరంలో ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఇంజరంలో దేశంలోనే నాణ్యమైన బట్టలను నేసేవారు. 1827లో ఫ్యాక్టరీ మూతపడింది. ఆ తరువాత ఇంజరం వాణిజ్య కేంద్రంగా ప్రాముఖ్యత కోల్పోయింది. ఇంజరం పండితులకు నిలయం. ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి గారు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ముఖ్యలు. ఇంజరం జమీందారు నందికోళ్ల గోపాలరావు గారు గొప్ప చిత్రకారుడు. వీరు గ్రామం లోని ఆలయాలకు ఆర్ధిక సహాయం అందిచేవారు. పూర్వం ఇంజరం గ్రామానికి అనేక వరదలు, ఉప్పెనలు వచ్చు చుండేవి. ఆ కారణంగా ఇంజరం రెండుగా విడిపోయింది. గోదావరి గట్టుకు ఉత్తరం భాగం నందు ఇంజరం మరియు దక్షిణ గట్టున పాత ఇంజరం ఉంటుంది.

రవాణా సమాచారం : ద్రాక్షారామం - యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, కుయ్యేరు, ఉప్పుమిల్లి, కోలంక, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి.

ఇంజరం Bank Centre (శివాలయం బస్ స్టాప్) లేదా ఇంజరం బస్ స్టాండ్ కు సుమారు 200 Mtrs. దూరంలో శ్రీ ఉమాకృపేశ్వర స్వామి ఆలయం ఉంటుంది.

అర్చక స్వామి: మాకు సహకరించిన ఇంజరం అర్చక స్వామి శ్రీ కందుకూరి వెంకట సూర్య సుబ్బారావు, సెల్ నెం. 9912977166 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

భరణి నక్షత్రం స్తోత్రం

యమాయ త్వాంగిరస్యతే పితృమతే స్వాహా స్వాహా|

ధర్మాయ స్వాహా ధర్యపుత్రే||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Description