గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

గొల్లపాలెం గ్రామం / GOLLAPALEM VILLAGE

శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత గోకర్ణేశ్వర స్వామి

మిధునరాశి, ఆరుద్ర నక్షత్రం (2వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 14 kms. దూరాన గొల్లపాలెం గ్రామం (Gollapalem) కలదు. ద్రాక్షారామం - కాకినాడ రోడ్డు మార్గములో గొల్లపాలెం గ్రామం ఉంటుంది. గొల్లపాలెం ఊరులో శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత గోకర్ణేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. శ్రీ గోకర్ణేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

శ్రీ గోకర్ణేశ్వర స్వామి, శివ భగవానుని అష్ట మూర్తులలో ఒక్కడు అని చెప్పుచుంటారు. అష్ట మూర్తులలో ఆరవ స్వరూపమే "భీముడు".  సర్వమునకు అవకాశమొసగు, సర్వవ్యాపియగు మహాదేవుని ఆకాశాత్మక రూపమును  "భీముడు" అని అంటారు. ఈ మూర్తి స్థానం ఆకాశం. దేహం లోని రంధ్రాలలో (బయలు ప్రదేశం) వ్యాపించి ఉంటాడు. ఇతని శరీరం భీమము. గోకర్ణ అనగా గోవు యొక్క చెవి అని అర్ధం. దేహం లోని రంధ్రాలలో (బయలు ప్రదేశం) చెవి కూడ ఒక్కటి. దీనికి ఈశ్వరుడు "శ్రీ గోకర్ణేశ్వరడు".

ఆలయం: శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత గోకర్ణేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణము విశాలముగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో అశ్వత్థ వృక్షము (రావిచెట్టు), ధ్వజ స్ధంబం, ప్రధానాలయం, చండీశ్వరుడు మరియు అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలు ఉంటాయి. అశ్వత్థ వృక్షము క్రింద సంతాన రుద్రేశ్వరుడు ఉంటాడు. స్వామి కృప వలన సంతాన సిద్ధి కలుగుతుంది అని భక్తుల విశ్వాసం.

ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది.  ముఖ మండపం నందు ఆంజనేయ స్వామి కలరు. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. అంతరాలయం నందు నందీశ్వరుడు, గణపతి స్వామి కలరు. గర్భాలయం నందు శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత గోకర్ణేశ్వర స్వామి వారి దర్శనం లభ్యమవుతుంది. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. ఆలయం నందు గ్రహ శాంతులు, హోమం, నామకరణం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం మొదలగునవి జరుపుతారు. 

శ్రీ గోకర్ణేశ్వర లింగము, ఆరుద్ర నక్షత్రం (2వ పాదం) చెందినది. ఈ రాశిలో జన్మించిన వారికి అభిషేక శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది.

ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణము జరుపుతారు. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి. రుద్రహోమం, జరుగుతాయి.  అర్ధరాత్రి లింగోద్భవం కార్యాక్రమం జరుపుతారు.  శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్బారాయుడు షష్ఠి వేడుకులు వైభవంగా జరుగుతాయి. ప్రతి మాస శివరాత్రి సందర్భముగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించుతారు. 

నక్షత్ర శాంతి కోసం ఆలయ అర్చక స్వామి: శ్రీ శ్రీ పూజ్యం మల్లిఖార్జున శర్మ సంప్రదించగలరు.

రవాణా సమాచారం: కోటిపల్లి నుంచి కాకినాడ పోవు బస్సులు (Via) ద్రాక్షారామం,హసన్ బాద, ఉండూరు, జగన్నాధగిరి, గొల్లపాలెం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామం నకు సుమారు 14 Kms. దూరంలో గొల్లపాలెం గ్రామం ఉంటుంది.  యాత్రికులు గొల్లపాలెం లోని మార్కెట్టు బస్ స్టేజి దిగాలి.  బస్ స్టాప్ కు సుమారు 300 meters దూరంలో (ఊరు లోనికి) శివాలయం ఉంటుంది.

ద్రాక్షారామం నుంచి గొల్లపాలెం మీదగా కాకినాడ కు షేరింగ్ ఆటోలు కూడ దొరుకుతాయి.

అర్చక స్వామి: మాకు సహకరించిన గొల్లపాలెం అర్చక స్వామి శ్రీ పూజ్యం మల్లిఖార్జున శర్మ, సెల్: 95159 91986 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

ఆరుద్ర నక్షత్రం స్తోత్రం

నమస్తే రుద్ర మానవ్య ఉతో త ఇషవరె నమ:

బాహుభ్యా ముమతే నమ:

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.