గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

వేములవాడ గ్రామం / VEMULAWADA VILLAGE

శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి

మిధునరాశి, ఆరుద్ర నక్షత్రం (3వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 21kms. దూరాన, తుల్యభాగ నదీకి ఉత్తర తీరాన వేములవాడ గ్రామం (Vemulawada) కలదు. రామచంద్రపురం - కాకినాడ రోడ్డు మార్గములో వేములవాడ బస్ స్టాప్ ఉంటుంది. వేములవాడ బస్ స్టాప్ నకు దక్షిణ దిశ నందు వేములవాడ గ్రామం ఉంటుంది. వేములవాడ ఊరు శివారులో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయం కలదు. శ్రీ భీమేశ్వర లింగము, ఆరుద్ర నక్షత్రం (3వ పాదం) చెందినది. ఆరుద్ర నక్షత్రం నందలి 3వ పాదము లో జన్మంచిన వారికి శాంతులు నిర్వహించుతారు. శ్రీ భీమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

క్షేత్ర విశిష్టత: ఆది కవిగా ఖ్యాతి గాంచిన భీమకవి జన్మ స్ధలం వేములవాడ. ఇతడు అగ్రహారానికి చెందిన ఒక బ్రాహ్మణుడు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి అనుగ్రహముతో వాక్కు శుద్ధి పొందినాడు. భీమన్న తండ్రి సోమనాధామాత్యుడు. ఇతడు నియోగి బ్రహ్మణుడు. పుత్ర సంతానము కోసం పెక్కు దాన ధర్మలు చేసాడు. కాని సంతానము కలగలేదు. ఒకనాడ సంతాన వియోగంతో మరణం పొందుతాడు. అతని అయిదుగురు భార్యలు (వితంతువులు) ఒకనాడు ద్రాక్షారామ క్షేత్రం వెళ్ళి శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆ వితంతువులలో చిన్నది మాచమ్మ. బాల వితంతువు అయిన మాచమ్మ తన భర్త కోరిక తీర్చమని భీమేశ్వర స్వామిని ప్రార్థిస్తుంది.

భీమేశ్వరుడు ఆమె అమాయక కోరిక పట్ల సంతోషించి, ఆమెకు సంతానం ప్రసాధించుతాడు. మాచమ్మ ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. అతడు భీమన్నగా పెరిగాడు. సమాజం భీమన్నకు గౌరవం, విద్యనూ ఇవ్వలేదు. ఒక రోజు అతడు నా తండ్రి ఎవరు? అని తల్లిని అడిగాడు. తల్లి ఆదేశంతో భీమన్న ద్రాక్షారామ క్షేత్రం నందలి శ్రీ భీమేశ్వర స్వామిని ప్రార్ధించుతాడు. భీమేశ్వరుడు ప్రత్యక్షమై వాక్కు శుద్ధి  ప్రసాధించుతాడు. శ్రీ ద్రాక్షారామ భీమేశ్వర కృపా కటాక్షములు పొందిన వేములవాడ భీమకవి అనేక రచనలు గావించినాడు. ఇతడు కవిగా ఉద్దండ కవితావాగ్ధురీణుడై, ఎందరో ప్రభువులను, రాజ్యాధినేతలను తన మృదుమధురపద పద్యపరిమళాలతో రంజింపచేసాడు (వేములవాడ భీమకవి జన్మ స్ధలం/కాలము గురించి  స్పష్టంగా ఆధారములు లేవు).

ఆలయం: వేములవాడ గ్రామం నకు దక్షిణ వైపు తుల్యభాగ నదీ ప్రవాహం ఉంటుంది. నదీ తీరాన శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమంలో భక్తులు ఆలయం పునర్నిర్మాణము జరిపించారు. ఆలయ ప్రాంగణము నకు నాలుగు దిక్కుల యందు ప్రవేశ ద్వారములున్నాయి. సాధరణంగా భక్తులు తుల్యభాగ నదీ తీరములో పవిత్ర స్నానములు ఆచారించి, దక్షిణ ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేస్తారు. ఆలయ ప్రాంగణము విశాలముగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, నందీశ్వరుడు, నవగ్రహ మంటపం, ప్రధానాలయం, చండీశ్వరుడు మొదలగునవి దర్శనమిస్తాయి. ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది.

ముఖ మండపం నందు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి మరియు శ్రీ మాణిక్యాంబ అమ్మ వారు తూర్పు అభిముఖంగా కొలువుదీరినారు. వీరితో పాటు శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహం కూడ కలదు. అంతరాలయం నందు చిన్న నంది, శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కళ్యాణ ఉత్సవ మూర్తుల దర్శనం లభ్యమవుతుంది. గర్భాలయం నందు  శ్రీ భీమేశ్వరస్వామి కొలువుదీరినారు. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి వార్షిక కళ్యాణం జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది.

మహాశివరాత్రి చాల వైభవంగా జరుగుతుంది. రాత్రికి లింగోద్భవ పూజ జరుగుతాయి. ప్రతి మాస శివరాత్రికి విశేష పూజలు ఉంటాయి. కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణము జరుపుతారు.  గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, సుబ్బారాయుడు షష్ఠి వేడుకులు వైభవంగా జరుగుతాయి. మాఘ శుద్ధ పంచమి నాడు నవగ్రహ వార్షిక ఉత్సవాలు నిర్వహించుతారు. ముక్కోటి ఏకాదశి సందర్భముగా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామికి ప్రత్యేక అర్చనలు ఉంటాయి. కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దీక్షలు, పూజలు జరుగుతాయి.

రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 7 kms. దూరంలో రామచంద్రాపురం RTC బస్ స్టాండ్ ఉంటుంది. ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురం నకు బస్సులు / ఆటోలు దొరుకుతాయి.

రవాణా సమాచారం 2:రామచంద్రాపురం బస్ స్టాండ్ నుంచి కాకినాడ కు బస్సులు చాల ఎక్కువుగా దొరుకుతాయి. రామచంద్రాపురం - కాకినాడ బస్సులు (via) వేలంగి, వేములవాడ, కరప మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం 3:వేములవాడ బస్ స్టాప్ నుంచి వేములవాడ గ్రామం నకు రోడ్డు ఉంది. వేములవాడ బస్ స్టాప్ నుంచి శ్రీ భీమేశ్వరస్వామి ఆలయ దూరం సుమారు 750 meters.  వేములవాడ బస్ స్టాప్ నుంచి వేములవాడ గ్రామం మీదగా ప్రయాణం. కొంత దూరం కాలువ గట్టు పైన ప్రయాణం ఉంటుంది.

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన వేములవాడ అర్చక స్వామి శ్రీ మాచరి సత్య కామేశ్వర పురుషోత్తమ శర్మ, సెల్ నెం. 99510 28619 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

ఆరుద్ర నక్షత్రం స్తోత్రం

నమస్తే రుద్ర మానవ్య ఉతో త ఇషవరె నమ:

బాహుభ్యా ముమతే నమ:

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.