గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
పల్లిపాలెం గ్రామం / PALLIPALEM
శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
మేషరాశి, భరణి నక్షత్రం (3వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 18 kms. దూరాన పల్లిపాలెం (Pallipalem) గ్రామం ఉంది. ఇచ్చట శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ వ్యాసేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీ వ్యాసేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: అత్రి మహాముని తీసుకు వచ్చిన నదిని 'ఆత్రేయ గోదావరి' గా పిలుస్తారు. ఆత్రేయ గోదావరికి దక్షిణ తీరములో పల్లిపాలెం గ్రామం ఉంది. ఇది కాజులూరు మండలం పరిధి లోనికి వస్తుంది. పల్లిపాలెం గ్రామం నందు శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ వ్యాసేశ్వర స్వామి ఆలయం దర్శించగలము. శ్రీ వ్యాసేశ్వర లింగము ను మేషరాశి లోని భరణి నక్షత్రం (3వ పాదం) చెందిన ప్రతిష్టగా చెప్పుచుంటారు. భరణి నక్షత్రం 3 వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును. జన్మించిన శిశువు యొక్క నక్షత్ర దోషములు నివారించుటకు అభిషేక శాంతులు జరుపుతారు. పల్లిపాలెం గ్రామం లోని శ్రీ వ్యాసేశ్వర లింగము నకు అభిషేక శాంతులు జరిపించుట శ్రేష్టం.
ఆలయం ప్రాచీనమైనది. కొంత మంది దాతల సహాకారం తో ఆలయం నందు ముఖమండపం, కళ్యాణ మండపం మొదలగు అభివృది నిర్మాణాలు జరిగినాయి. గర్భాలయం నందు ఆది దంపతులు దర్శనమిస్తారు. అంతరాలయం నందు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి కలరు. చండ - ప్రచండ ద్వారపాలకులు, చండీశ్వరుడు, నాగ బంధం, నవగ్రహ మండపం, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు మొదలగు మూర్తులు కొలువై ఉన్నారు. ఆలయం నకు ఉత్తరముగా అత్రి నది, ఈశాన్యంగా పుష్కరిణి, దక్షిణం దిశలో ఔదుంబర వృక్షం ఉంటాయి. శ్రీ వ్యాసేశ్వర స్వామిని సేవించిన వారికి సంతాన ఫలం కలుగును అని గట్టి విశ్వాసం భక్తులలో ఉంది. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ వ్యాసేశ్వర స్వామి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది
ఔదుంబర వృక్షం (మేడి చెట్టు) భూలోక కల్పవృక్షము. ఇది గురు దత్తాత్రేయులవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం. దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మరూపంలో సుప్రతిష్టితులై ఈవృక్ష మూలమునందు సర్వదా ఉంటారని పైంగ్య బ్రాహ్మణము నందు వివరించబడినది. శ్రీపాదుల వారి సందేశ ప్రకారం ఔదుంబర వృక్షం నుండి ప్రాణశక్తి వెలువడును. ఔదుంబర మూలమున చేసిన జపఫలము కోటి రెట్లవుతుంది. గొడ్రాళ్ళను కూడా సంతాన వంతులను చేసే మహత్తుగల వృక్షమిది. పల్లిపాలెం పోస్ట్ ఆఫీస్ కు సమీపంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ వ్యాసేశ్వర స్వామి ఆలయం ఉంటుంది.
గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
మహావిష్ణువు అంశగా ఆషాఢ పౌర్ణమినాడు జన్మించి సకల కళానిధియై వేదములను విభజించిన విద్యావేత్త సద్గురువు వేదవ్యాసుడు. వేదవ్యాసుడు మేరునగముపై శివుని గూర్చి తపస్సు చేసి రాగాతీతుడైన పుత్రుని పొందాడు. అతడే శుకమహర్షి. వ్యాసుడు కాశీ పురములో నివసించు చున్నప్పుడు ఒకసారి కాశీలో ఏ ఇంట నుంచి భిక్ష లభించక పోవుటచే, వ్యాసుడు కాశీను శపించబోగా అన్నపూర్ణా దేవి అడుపడి, అతని కుద్బాధ(ఆకాలి) తీర్చి, కాశీ బహిష్కరణ గావించింది. శివుని ఆదేశముతో దక్షిణ కాశి అయిన ద్రాక్షారామ క్షేత్రం చేరుకొంటాడు. అగస్త్యుడు సలహ అనుసరించి ద్రాక్షారామ పరిసర ప్రాంతములను సందర్శించి, పలు చోట్ల శివలింగాలు ప్రతిష్టించాడు.
రవాణా సమాచారం 1: రాజమండ్రి - యానాం బస్సులు (Via) ద్రాక్షారామం, ఎర్ర పోతవరం, బాలాంత్రం, కుయ్యేరు, ఉప్పుమిల్లి , పల్లిపాలెం బస్ స్టాప్, కోలంక, ఇంజరం, యానాం బైపాస్ రోడ్ మీదగా ప్రతి గంటకు ఉంటాయి.
రవాణా సమాచారం 2: యానాం బైపాస్ రోడ్ (Sri Ravi Junior & Degree College, Near Yanam Bi Pass Sunkarapalem, Andhra Pradesh) నుంచి పల్లిపాలెం గ్రామం నకు ఎక్కువుగా ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 5 kms. వీటిని (ఆటో) రాను - పోను ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది సౌక్యముగా ఉంటుంది.
అర్చక స్వామి: మాకు సహకరించిన పల్లిపాలెం అర్చక స్వామి శ్రీ క్తొత్తలంక వీరభద్ర ప్రసాద్, సెల్ నెం. 9849754014 గార్కి నా నమసుమాంజలి.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
భరణి నక్షత్రం స్తోత్రం
యమాయ త్వాంగిరస్యతే పితృమతే స్వాహా స్వాహా|
ధర్మాయ స్వాహా ధర్యపుత్రే||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.
వీడియో వివరణ / Video Description
ఆడియో వివరణ / Audio Description