గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

కూర్మాపురం గ్రామం / KURMAPURAM VILLAGE

శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి

వృశ్చికరాశి, విశాఖ నక్షత్రం (4వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి పశ్చిమ-ఆగ్నేయం దిశగా సుమారు 18 kms. దూరాన కూర్మాపురం (Kurmapuram) అను గ్రామం కలదు. రామచంద్రపురం నుంచి వాకతిప్ప బస్సులు (వయా) ముచ్చిమిల్లి, వెంటూరు, కురకాళ్ళపల్లి, పామర్రు మీదగా ఉంటాయి. కురకాళ్ళపల్లి బస్ స్టాప్ కు పశ్చిమ దిశగా సుమారు 2.5 Kms. దూరంలో కూర్మాపురం గ్రామం కలదు. ఇచ్చట శ్రీ రామలింగేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం విశాఖ నక్షత్రం (4వ పాదం) చెందినది. శ్రీ రామలింగేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. అంతరాలయములో గణపతి, నాగబంధము, కుమారస్వామి దర్శనమిస్తారు.

ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ రామలింగేశ్వరలింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి పాంచాహ్నికంగా జరుగుతుంది. గణపతి నవరాత్రులు సుబ్రహ్మణ్య షష్ఠి, శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. తులరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: రామచంద్రపురం (మార్కెట్టు సెంటర్) నుంచి పామర్రు ఆటోలు (వయా) ముచ్చిమిల్లి, వెంటూరు, కురకాళ్ళపల్లి మీదగా ఉంటాయి. కురకాళ్ళపల్లి నుంచి కూర్మాపురం కు ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి. రామచంద్రపురం మార్కెట్టు సెంటర్ నుంచి కూర్మాపురం దూరం సుమారు 10 కీ.మ

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ S. పట్టాభి రామయ్య సెల్ నెం: 94411 43491 & 95732 46236, శ్రీ తేజ సెల్ నెం: 81249 13393 & శ్రీ పుల్లేటికుర్తి ఉమా మల్లేశ్వరరావు , సెల్ నెం: 94920 77744 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

విశాఖ నక్షత్రం స్తోత్రం

ఇంద్రాగ్నీ ఆగాత్‌ సుతం గీమినేమో వరేణాయ భూ:|

అస్య పాతం ధియేషితా||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.