అష్టాదశ శక్తిపీఠాలు / Ashtadasa ShakthiPeetalu

అష్టాదశ శక్తిపీఠాలు

కాశ్మీరేతూ సరస్వతీ

శ్రీనగర్, కాశ్మీరు


     సాక్షాత్తు పరమేశ్వరుని అవతారంగా భావించే ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త మరియు వేదాంతవేత్తగా ప్రతీతి. ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకాన్నే, అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకము లోని 18 వ శక్తిపీఠం "కాశ్మీరేతు సరస్వతి". కాశ్మీరు పుణ్య భూమి మీద సరస్వతి పేరుతో శక్తి పీఠం కనిపించుట లేదు. కాశ్మీర్ యొక్క ఉత్తర భాగంలో, నీలంనదీ తీర ప్రాంతం శారద గ్రామం ఉంది. ఇచ్చట "శారదా పీఠం" కలదు. దీనిని కూడ ఆది శంకరాచార్యులు ఆరాధించారు అని గ్రంధములు చెప్పుచున్నవి.


     జమ్మూతావి - కాశ్మీరు  రాజధాని శ్రీనగర్. ఇది ప్రకృతి అందాలన్నీ మూటగట్టి రాసిపోసిన సుందర దివ్య ధామం. పూర్వం హిందూ రాజ్యంగా ఉండి, అనేక హిందూ దేవాలయాలుకు నిలయంగా ఉండేది. హిందూ రాజులు తరువాత పాలనకు వచ్చిన మహమ్మదీయులు మత చాంధసత్వం తో పలు హిందూ ఆలయాలును నేలమట్టము చేశారు. కాశ్మీర్ ప్రాంతములో అనేక శక్తి పీఠాలున్నాయి. శ్రీనగర్ కు సుమారు 10 కీ.మీ దూరాన గల హరి పర్వతం మీద "శారికాదేవి శక్తి పీఠం" కలదు. శ్రీనగర్ నుంచి రవాణ సౌకర్యములు కలవు. దీనితో పాటు "జ్యష్టాదేవి పీఠం", "కీర్ భవానీ ఆలయం", "శివసతి  ఆలయం" మరియు గుల్మార్, అవంతి పూర్, డాల్  సరస్సు మొదలగు పర్యాటక ప్రదేశములు దర్శనీయం. వీటిని సందర్శించుటకు స్ధానిక టూర్స్ దొరుకుతాయి.


     కాశ్మీర్ యొక్క ఉత్తర భాగంలో నీలంనదీ తీర ప్రాంతం ఉంటుంది. నదీ తీరంలో  "శారదా" పేరుతో ఒక చిన్న గ్రామం కలదు. స్వాతంత్రానికి ముందు ఇచ్చట హిందూ పండిట్ల గొప్ప సంఖ్యలో స్థిరపడ్డారు. ఇచ్చట శారద దేవతకు చెందిన ఒక పురాతన ఆలయం ఉండేది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ఖ్యాతి పొందినది. 6 -12 వ శతాబ్దాల మధ్యకాలంలో భారత ఉపఖండంలో ఉన్నత విద్యాభ్యాసం క్షేత్రాల్లో శారదా ఒకటి. ఉత్తర & దక్షిణ భారత బ్రాహ్మణులు వారి విద్య ప్రారంభించే ముందు శారద పీఠం దర్శించుట పురాతన సాంప్రదాయంగా ఉండేది. బ్రాహ్మణులు యజ్ఞోపవిత్ కార్యక్రమంలో పాల్గొనట జరిగేది.


     1030 వ సంవత్సర(CE) లో, ముస్లిం చరిత్రకారు అయిన అల్-బిరునీ కాశ్మీర సందర్శించినాడు. అతని పుస్తకం లో శ్రీ శారద దేవి విగ్రహం చెక్కతో ఉండేది అని వ్రాయడం జరిగింది. అతను శారద టెంపుల్ ను 'ముల్తాన్ సన్ టెంపుల్' తోను, తనేసర్ లోని విష్ణు చక్ర స్వామి టెంపుల్ తోను మరియు సోమనాథ్ టెంపుల్ తో పోల్చాడు. మొదటిసారిగా 14 వ శతాబ్దంలో శారద ఆలయం పై ముస్లిం దండయాత్రల దాడి జరిగింది.  ఈ దాడి తరువాత, భారతదేశం కృష్ణగంగా మరియు శారద పీఠంతో సంబంధాన్ని కోల్పోయింది. 19 వ శతాబ్దంలో కాశ్మీర్ రాజ్యంలోని  డోగ్రా మహారాజా అయిన గులాబ్ సింగ్, శారద ఆలయాన్ని పునరుద్ధరించాడు.


    పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య  జరిగిన 1947-1948 కాశ్మీర్ యుద్ధం తరువాత ఈ ప్రాంతం   పష్టున్ గిరిజనుల నియంత్రణలోకి వచ్చింది.  ఆ తరువాత పాకిస్తాన్ యొక్క "ఆజాద్ కాశ్మీర్" గా కొత్తగా ఏర్పడినది. 2005 లో వచ్చిన భూకంపంలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం భారీగా దెబ్బతింది. దీనిలో  శారద పీఠం కూడ ఉంది. సుమారు 70 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని మోదీ గారి చొరవ కారణముగా ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో హిందువులు ఆర్ధిక సహాకారములుతో శారద పీఠంను పునర్నిర్మించారు. March -2023 నుంచి పూజలు, యజ్ఞా హోమలు ప్రారంబించారు.


     ఆజాద్ కాశ్మీర్ రాజధాని ముజాఫ్ఫార్బాద్  (Muzaffarabad). ముజాఫ్ఫార్బాద్ కి సుమారు 150 కీ.మీ దూరంలో శారద గ్రామం ఉంది. సముద్ర మట్టానికి సుమారు 1,981 meters ఎత్తులో ఉంటుంది. ముజాఫ్ఫార్బాద్ నుంచి శారద గ్రామం నకు రవాణా సౌకర్యములు ఉంటాయి. శారదలో వసతి సౌకర్యములు కలవు.


     దేశం నలుమూలల నుంచి జమ్ముతావి కు రైలు కలవు. డిల్లీ నుంచి హెచ్చు రైలు/బస్సులు బయులుదేరుతాయి. జమ్ముతావి నుంచి శ్రీనగర్ కు బస్సులున్నాయి. వీటి మధ్య 295 కీ.మీ ఘాట్ రోడ్డు మార్గం కలదు. రైలు మార్గం నిర్మాణము దశలో ఉంది. కాశ్మీర్ & జమ్ముతావి నందు మంచి వసతులు దొరుకుతాయి. కాశ్మీర్ లోని హరి పర్వతం మీద శారికాదేవి శక్తి పీఠం చూడదగినది. కాశ్మీర్ లో జ్యష్టాదేవి పీఠం, కీర్ భవానీ ఆలయం, శివసతి  ఆలయం మరియు జమ్ముతావి లోని శ్రీ రణబీరేశ్వరాలయం & శ్రీ రఘనాథ్ ఆలయం మొదలగునవి చూడదగినవి. వైష్ణవీ దేవి  ఆలయం జమ్ముతావి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. కాట్రా ప్రాంతానికి చెందినది.

* J&K Srinagar (India) to Sharda peeth (Azad Kashmir) (వయా) Kupwara distance = 246 Kms.

                         

Google map: https://maps.app.goo.gl/AFWFPfGsD9md3BBt9

Video: https://m.facebook.com/story.php?story_fbid=2037471879934880&id=100010162631367&sfnsn=wiwspwa&mibextid=RUbZ1f

Book link: https://m.facebook.com/story.php?story_fbid=782772943414821&id=100050463670982&sfnsn=wiwspmo&mibextid=RUbZ

Ashtadasa Shaktipeethas

Kashmir is also Saraswati

Srinagar, Kashmir


     Adi Shankaracharya, considered an incarnation of the Supreme Lord, is an Indian philosopher and theologian who consolidated the doctrine of Advaita Vedanta. The hymns said by Adisankaracharya are taken as standard in the case of Ashtadasa Shaktipeethas. It is believed that Adi Shankara visited these eighteen Kshetras and worshiped Sri Chakra. The 18th Shaktipeeth in the hymn by Adi Shankaracharya is "Kashmirethu Saraswati". There is no Shakti Peetha in the name of Saraswati on the holy land of Kashmir. In the northern part of Kashmir, on the banks of the Neelam River is the village of Sarada. There is "Sharada Peetham" here. The scriptures say that this was also worshiped by Adi Shankaracharya.


Srinagar is the capital of Jammu and Kashmir. It is a beautiful divine abode with all the natural beauty wrapped up in it. Formerly a Hindu kingdom, it was home to many Hindu temples. After the Hindu kings, the Mohammedans who came to rule destroyed many Hindu temples with religious violence. There are many Shakti Peethas in the Kashmir region. About 10 km from Srinagar there is "Sharikadevi Shakti Peetha" on Mount Hari. There are transport facilities from Srinagar. Along with this "Jyashtadevi Peetham", "Keer Bhavani Temple", "Shivasati Temple" and tourist places like Gulmar, Avantipur, Dal Lake etc. are worth seeing. Local tours are available to visit these.


The northern part of Kashmir consists of the Neelamnadi coastal region. On the banks of the river there is a small village named "Sharda". A large number of Hindu Pandits settled here before independence. There was an ancient temple belonging to Goddess Sharada here. It is reputed as one of the Ashtadasha Shakti Peethas. Sarada was one of the centers of higher learning in the Indian subcontinent between the 6th and 12th centuries. It was an ancient tradition for Brahmins of North & South India to visit Sarada Peetha before starting their education. Brahmins used to participate in the Yajnopavit program.


In 1030 CE, the Muslim historian Al-Biruni visited Kashmir. In his book it is written that the idol of Sri Sharada Devi was made of wood. He compares the Sharada Temple with the 'Multan Sun Temple', the Vishnu Chakra Swamy Temple in Thanesar and the Somnath Temple. The Sharada temple was attacked by Muslim invaders for the first time in the 14th century. After this attack, India lost its connection with Krishnaganga and Sarada Peetha. In the 19th century, Gulab Singh, the Dogra Maharaja of Kashmir, restored the Sarada temple.


After the 1947-1948 Kashmir war between Pakistan and India, the region came under the control of Pashtun tribes. It was then newly formed as "Azad Kashmir" of Pakistan. In 2005, the Pakistan Occupied Kashmir region was heavily damaged by the earthquake. It also has Sharada Peetham. After about 70 years, due to the initiative of the Indian Prime Minister Modi, the Hindus in the Occupied Kashmir region rebuilt the Sarada Peetha with financial assistance. Poojas and Yajna homals started from March-2023.


     Muzaffarabad is the capital of Azad Kashmir. Sharda village is located about 150 km from Muzaffarbad. It is about 1,981 meters above sea level. There are transport facilities from Muzaffarbad to Sharda village. Accommodation facilities are available in Sarada.


There are trains from all over the country to Jammu. High speed trains/buses depart from Delhi. There are buses from Jammu to Srinagar. There is a 295 km ghat road between them. The railway line is under construction. Good accommodation is available in Kashmir & Jammu. Sharikadevi Shakti Peetha on Mount Hari in Kashmir is worth seeing. Jyashtadevi Peetha, Keer Bhavani Temple, Shivsati Temple and Sri Ranbireshwara Temple & Sri Raghanath Temple in Jammu are some of the places to visit in Kashmir. The Vaishnavi Devi Temple is situated in Trikuta Parvat Seni in the high Himalayas, about 65 km from Jammutavi. Belongs to Katra region.

J&K Srinagar (India) to Sharda peeth (Azad Kashmir) (via) Kupwara distance = 246 Kms.


Google map: https://maps.app.goo.gl/AFWFPfGsD9md3BBt9

Video: https://m.facebook.com/story.php?story_fbid=2037471879934880&id=100010162631367&sfnsn=wiwspwa&mibextid=RUbZ1f

Book link: https://m.facebook.com/story.php?story_fbid=782772943414821&id=100050463670982&sfnsn=wiwspmo&mibextid=RUbZ