గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

ఓదూరు గ్రామం / ODURU VILLAGE

శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి

కర్కాటకరాశి, పుష్యమి నక్షత్రం (4వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 13 kms. దూరాన, ఓదూరు (Oduru) గ్రామం ఉంటుంది. ఇది తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలంకు చెందినది. రామచంద్రపురం - కరప  రోడ్డులో ఓదూరు బస్ స్టాప్ ఉంటుంది. రోడ్డుకు కొంత లోపలకి ఓదూరు గ్రామం కలదు. ఓదూరు నందు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరస్వామి (శివాలయం) కలదు. శ్రీ సోమేశ్వరస్వామి లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

స్ధల పురాణం :ఓదూరుకి మరో పేరు ఓంకారపురం. దీని గురించి శ్రీనాథ మహాకవి రచించిన "భీమఖండం" అను కావ్యంలో ఉంది. వ్యాస మహర్శి తన అపరాదం వలన కాశీక్షేత్రంను విడిచి పెట్టి తన శిష్యులతో కలసి భీమేశ్వరుని కన్న ఉత్తమమైన దేవుడు, ద్రాక్షారామం కన్న మిన్నయైన పుణ్యక్షేత్రం లేదని తలిచి, ఆ దివ్య దర్శనముకై బయలుదేరి మొదటి పూరి జగన్నాధాలయంను దర్శించి, మార్గ మధ్మన గల శ్రీకూర్మం, సింహచలం, పిఠాపురం, సామర్లకోట, సర్పవరం క్షేత్రాలు దర్శించిన తరువాత తుల్యభాగ నదీతీరాన గల సాంపరాయణపురం (సంపర) గ్రామంను దర్శించిన పిమ్మట దక్షవాటికకు బయలుదేరగా,  ఓంకారపురం క్షేత్రం (ఓదూరు) నందు అగస్థ్యుడు తన భార్య లోపాముద్రి సమేతంగా వ్యాసులవారిని కలుసుకొని కుశల ప్రశ్నలు వేసుకుని ఓంకారపురం క్షేత్రం నందు వున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వారు స్తుతించిరి. వ్యాస, వైశంపాయన, అగస్త్య ఋషీశ్వరులు సంచరించిన పుణ్యభూమి ఓంకారపురం క్షేత్రం (ఓదూరు).

శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరస్వామి (శివాలయం) చాల ప్రాచీనమైనది. ఆలయ ప్రాంగణంలో శ్రీ రుక్మిణి, సత్యభామా సమేత వేణుగోపాలస్వామి వారి ఆలయం మరియు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి ఆలయం కలవు. శ్రీ సోమేశ్వరస్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవములు ఫాల్గుణ బహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఇదే రోజున వేణుగోపాలస్వామి మరియు వేంకటేశ్వర స్వామివారి (ముగ్గురు దేవతామూర్తులు) కళ్యాణ ఉత్సవములు జరుగుట విశేషం. సోమేశ్వరస్వామి ఆలయంలో “అఖండజ్యోతి” నిరంతరం వెలుగుతుంది. ఇది మరో విశేషం. శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించ బడతాయి. క్షేత్రము కర్కాటకరాశి యందలి పుష్యమి నక్షత్రం నాలుగవ పాదమునకు చెందినది. పుష్యమి జాతకులు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామిని దర్శించి అర్చన, అభిషేకములు నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు లభించునని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి రామచంద్రపురం కు బస్సులు ఉంటాయి. రామచంద్రపురం నుంచి కాకినాడ వైపు పోవు బస్సులు (Via) ఓదూరు, వేళంగి మీదగా ఉంటాయి. ఓదూరు బస్సు స్టాపునకు కొంత లోపలకి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరస్వామి (శివాలయం) ఉంటుంది.

అర్చక స్వామి: ఓదూరు, శ్రీ సోమేశ్వర స్వామి, అర్చక స్వాములు. సతీష్ సెల్: 96403 52052

ఓదూరు గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయం, ఆంజనేయస్వామివారి ఆలయం మరియు షిరిడి సాయినాధు మందిరం కూడా వున్నాయి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

పుష్యమి నక్షత్రం స్తోత్రం

బృహస్తే అతి యం దర్యో అర్హాద్‌ ధుమదూ విమాతి కృతు మజ్జనేషు|

యదీదయచ్ఛ వసరుతు ప్రజాత్‌ తదసమాసు ద్రవిణం ఘోహి చింతమ్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.