అన్నదానం / Annadanam

శ్రీ రాజరాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదాన సత్రం

భక్తులకు విజ్ఞప్తి


అన్నదానమునకు నధిక సంపదగల్గి

యమరలోక పూజ్యుడగును మీఱు

అన్నమగును బ్రహ్మమది కనలేరయా

విశ్వదాభిరామ వినుర వేమ!

తాత్పర్యము: అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. ఆ దానాన్ని మించిన దానం లేదు. అన్నదానం చేస్తే దేవలోక పూజలు అందుకుంటాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం


అన్ని దానములకన్న అన్నదానము మిన్న అని అందరికి తెలిసినదే. కాని మనం చేసే అన్నదానము వివిధ ప్రాంతములలో చేయుటవలన విశేష ఫలితములు కలుగునని మన పూర్వీకులు విశ్వసించి, మనకు కొన్ని క్షేత్రాలను ప్రతిపాదించారు. అటువంటివే కాశీ, ప్రయాగ, గయ, శ్రీశైలం మొ||వి. వాటి కన్న కూడా మిక్కిలి ప్రశస్తమైనది ఈ దక్షపురి అని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతి కి వివరించినట్లు భీమఖండం 28వ అధ్యాయము లో విశదీకరింప బడినది.

కాశీ క్షేత్రము నందు కోటిమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టిన ఎంత ఫలమో ద్రాక్షారామ క్షేత్రమందు ఒక శివభక్తుని కి భిక్ష వేసినంత మాత్రముననే సిద్ధించుచున్నది. గ్రహణ కాలమందు కురుక్షేత్రము న తులాపురుషదానము చేసిన ఎంత ఫలమో అట్టి ఫలమును ద్రాక్షారామ క్షేత్రము లో భోజనము పెట్టినంత మాత్రముననే సిద్ధించుచున్నది. మీ పుట్టిన రోజున గాని లేదా మీ శ్రీమతి పుట్టిన రోజున గాని, పెళ్ళిరోజున గాని లేదా మీ పిల్లల పుట్టిన రోజున గాని లేదా మీ పెద్దల పుట్టిన రోజున గాని లేదా ఏదైనా విశేషమైన రోజులలో ద్రాక్షారామ క్షేత్రంలో అన్నదానం చేసి తరించండి. మీరు చందా పంపిన యెడల మీ తరపున అన్నదాన కార్యక్రమ నిర్వహించగలరు.

మేము మాస శివరాత్రి కమిటి వారి ఆధ్వర్యంలో ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ప్రతిరోజు ఉచితంగా భోజనం పెట్టాలని సంకల్పించి నిత్యాన్నదాన సత్రాన్ని భక్తుల సహకారంతో ఏర్పాటు చేసినాము. భక్త మహాశయులందరు మేము చేస్తున్న ఈ మహాయజ్ఞాని కి మీ వంతు సహకారం అందించి ఆ పరమేశ్వరు ని కృపకు పాత్రులు కాగలందులకు కోరుచున్నాము.

ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి. వీరు వాహనములు కూడ ఏర్పాట్టు చేస్తారు.


అన్నదాతలకు విన్నపము:

అన్నదానం కోసం మీరు ఈ క్రింది No. కు సంప్రదిచండి


Phone no. 83320 29544