అష్టాదశ శక్తిపీఠాలు / Ashtadasa ShakthiPeetalu
అష్టాదశ శక్తిపీఠాలు
పీఠికాయాం పురుహూతికా, కాకినాడ జిల్లా
ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడ పట్టణం నకు ఉత్తర దిశగా, సుమారు 19 కీ.మీ దూరాన కత్తిపూడి జాతీయ రహదారి (NH-216) నందు పిఠాపురం అను చిరు పట్టణం కలదు. ఇది పుణ్య పాదగయ క్షేత్రం. భారత దేశములో త్రిగయా క్షేత్రాలు ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో గయా పట్టణంను " శిరో గయా " అని పిలుస్తారు. ఒడిశా రాష్ట్రంలో ఉన్న జిజాపూర్ పట్టణంను " నాభి " గయా అంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలోని పిఠాపురంను " పాదగయ " గా కొలుస్తారు. స్ధల పురాణం ప్రకారం త్రిమూర్తుల యజ్ఞనానికి విఘ్నం కలిగించినందుకు మహావిష్ణువు గయాసురుని శరీరంను ఖండించగా, అతని పాదములు పీఠాపురంలో పడ్డాయి. నాటి నుంచి పాద గయగా ఖ్యాతి పొందినది. ఆలయ కోనేరు కు పశ్చిమ దిశన శ్రీ కుక్కుటేశ్వరాలయం ఉన్నది. ఆలయ ప్రాంగణములో శ్రీ పురుహూతికా శక్తి పీఠం, శ్రీ పాదవల్లభ స్వామి ఆలయం (దత్త పీఠం) మొదలగునవి ఉన్నాయి.
పిఠాపురం నుంచి సామర్లకోట పోవు రోడ్డు మార్గములో దక్షిణ రాజ గోపురం మరియు పిఠాపురం బైపాస్ రోడ్డులో పశ్చిమ ప్రవేశ ద్వారములు కలవు. దక్షిణ రాజ గోపురం నుంచి ప్రవేశం జరుగుతుంది. విశాలమైన చక్కటి కోనేరు మధ్యన గయాసుర మండపం బహు సుందరముగా ఉంటుంది. ఆలయ కోనేరు కు పశ్చిమ దిశన శ్రీ కుక్కుటేశ్వరాలయం ఉన్నది. ఆలయ ప్రాంగణములో శ్రీ పురుహూతికా శక్తి పీఠం, శ్రీ పాదవల్లభ స్వామి ఆలయం (దత్త పీఠం) మొదలగు వివిధ ఉపాలయాలు ఉన్నాయి.
శ్రీ కుక్కుటేశ్వరాలయం నకు 1995 లో జీర్ణద్ధరణ జరిగింది. కుక్కుటేశ్వరాలయం (శివాలయం) తూర్పు అభిముఖముగా ఉంటుంది. ఆలయం నందు నందీశ్వరుడు, కుక్కటేశ్వ లింగము, రాజ రాజేశ్వరి దేవి దర్శనమిస్తారు. గర్భాలయ వెనుక గోడల పైన కుక్కటం చిహ్నం ఉంటుంది. కుక్కటం అనగా కోడిపుంజు అని అర్ధం. స్ధల పురాణం నందు శివుడు కుక్కటంగా మారి గయాసుర ప్రయత్నం నకు విఘ్నం కలిగించుతాడు.
శివాలయం నకు ఈశాన్య మూల శ్రీ పురుహూతికా దేవి మందిరం దక్షిణ ముఖంగా ఉంటుంది. శ్రీ పురుహూతికా దేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆలయం గర్భాలయం, ముఖమండపం కలిగియుండును. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ గావించుటకు వీలుగా ఉండును. గర్భాలయ గోడలు పైన అష్టాదశ శక్తి పీఠాల మూర్తులును చూడగలం. అమ్మ కు ప్రతి నిత్యం అర్చనలు జరుగుతాయి. దేవి నవరాత్రులు వైభవంగా జరుగుతాయి.మహాశివరాత్రి, నవరాత్రి మరియు కార్తీక మాసం ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు. మాఘబహుల ఏకాదశి నాడు కుక్కుటేశ్వర ఆలయంలో వార్షిక పండుగను జరుపుకుంటారు.
సతీదేవి యొక్క పీఠభాగము (పిరుదులు) పడిన ప్రదేశముగా క్షేత్రం ప్రసిద్ధి. ఈ క్షేత్రం శ్రీ పీఠం, పురుహూతికా పురముగా పిలిచేవారు. కాలక్రమములో పిఠాపురం అయింది. నాటి పురుహూతికా పీఠం కాలగర్భములో కలసి పోయింది. చాల కాలము తర్వాత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి సహాకారముతో అగ్రహారం నందు శ్రీ పాదవల్లభ అనుఘాదత్త క్షేత్రం స్ధాపించారు. ఇచ్చట శ్రీ పాదవల్లభ స్వామి, గణేశ్ మందిరం మరియు శ్రీ పురుహూతికా దేవి మందిరం చూడవచ్చును. కొంత కాలము తర్వాత పిఠాపురం వాసులు శ్రీ కుక్కుటేశ్వర ఆలయ ప్రాంగణములో మరో శ్రీ పురుహూతికా దేవి విగ్రహం ప్రతిష్టించారు. కుక్కుటేశ్వర ఆలయ జీర్ణద్ధరణలో భాగముగా పురుహూతికా దేవి మందిరం కూడ నిర్మించారు. నేడు పురుహూతికా దేవికి నిత్య అర్చనలు, సేవలు, ఉత్సవ కార్యక్రామాలు నిర్వహించు చున్నారు. క్షేత్రం దర్శనము వలన పురుహూతికా దేవి అనుగ్రహము పొందగలము.
కాకినాడ - తుని మొదలగు బస్సులు పీఠాపురం ఊరు లోపల నుంచి ఉంటాయి. పీఠాపురం ఊరు ప్రారంభములో (కాకినాడ నుంచి) ప్రభుత్వం ఆసుపత్రి స్టాప్ ఉంది. ఇక్కడ నుంచి పాదగయ క్షేత్రం దగ్గర అవుతుంది. పీఠాపురం - సామర్లకోట రోడ్డు మార్గములో పాదగయ రాజ గోపురం ఉంది. రాజగోపురం నుంచి ఆలయ ప్రవేశం జరుగుతుంది ( మరో ద్వారం జాతీయ రహదారిలో - పీఠాపురం బైపాస్ ఉండును). రాజగోపురం దాటగానే పాదగయ కోనేరు దర్శన మిస్తుంది. పుష్కరిణి మధ్య గయాసురుని శవాసనం భారీ ప్రతిమగా ఉంటుంది.
హౌరా - చెన్నై రైలు మార్గము లో పిఠాపురం, సామర్లకోట జంక్షన్ అను రైల్వే స్టేషన్స్ ఉంటాయి. పిఠాపురం రైల్వే స్టేషన్ కొన్ని express trains ఆగుతాయి. ఇక్కడ నుంచి పాదగయ ఆలయం నకు ఆటోలు దొరుకుతాయి. సామర్లకోట రైల్వే స్టేషన్ లో అన్ని ముఖ్య రైలు ఆగుతాయి. ఇక్కడ నుంచి పిఠాపురం కు బస్సులు & షేరింగ్ ఆటోలు బయులు దేరును. సామర్లకోట - పిఠాపురం రవాణా సర్వీసులు పాదగయ గుడి మీదగా ఉంటాయి. కాకినాడ - తుని బస్సులు/షేరింగ్ ఆటోలు (వయా) పిఠాపురం & కత్తిపూడి మీదగా హెచ్చుగానే ఉంటాయి.
Google map: https://maps.app.goo.gl/jDZpx2Cs9pZyJAse8
Book link: https://m.facebook.com/story.php?story_fbid=782772943414821&id=100050463670982&sfnsn=wiwspmo&mibextid=RUbZ1f
Ashtadasa Shaktipeethas
Peethikayam Purhuthika, Kakinada District
North of Kakinada town, the capital of Kakinada district, Andhra Pradesh, at a distance of about 19 km, there is a small town called Pithapuram on Kathipudi National Highway (NH-216). This is Punya Padagaya Kshetra. There are Trigaya Kshetras in India. Gaya town in Bihar state is known as "Shiro Gaya". The city of Jijapur in the state of Odisha is known as "Nabhi" Gaya. Pithapuram in Kakinada district of Andhra Pradesh is measured as "Padagaya". According to the Sthala Purana, when Lord Vishnu condemned Gayasura's body for disrupting the Yajna of the Trinity, his feet landed in Peethapuram. Since then it has become famous as Pada Gaya. To the west of the corner of the temple is Sri Kukkuteswara Temple. There are Sri Puruhutika Shakti Peetha, Sri Padavallabha Swamy Temple (Datta Peetha) etc. in the temple premises.
The Dakshina Raja Gopuram is on the Pithapuram to Samarlakota Povu road and the western entrances are on the Pithapuram bypass road. Entry is from Dakshina Raja Gopuram. The Gayasura mandapam is very beautiful in the middle of a wide and beautiful corner. To the west of the corner of the temple is Sri Kukkuteswara Temple. In the temple premises there are various shrines like Sri Puruhutika Shakti Peetha, Sri Padavallaba Swamy Temple (Datta Peetha) etc.
Sri Kukkuteswaralayam was renovated in 1995. Kukkutesvaralayam (Shivalayam) faces east. Nandeeshwar, Kukkateshva Lingam and Raja Rajeshwari Devi are seen in the temple. On the back walls of the sanctum sanctorum is the symbol of a dog. Kukkatam means chicken droppings. In the Sthala Purana, Lord Shiva transforms into a dog and thwarts Gayasura's attempt.
The north-east corner of the Shiva temple is Sri Puruhutika Devi Mandir, facing south. Sri Puruhutika Devi is one of the Ashtadasha Shakti Peethas. The temple has sanctum sanctorum and mukhamandapam. It is possible to circumambulate around the sanctum sanctorum. On the walls of the sanctum sanctorum we can see sculptures of Ashtadasha Shakti Peethas. Prayers are done to Amma every time.
Devi Navratri is celebrated in grandeur.Mahasivaratri, Navratri and Kartika month are the main festivals celebrated in this temple. An annual festival is celebrated at Kukkuteswara Temple on Maghabahu Ekadashi.
The Kshetra is famous as the place where the Peethabhaga (buttocks) of Goddess Sati fell. This place was called Sri Peetham, Puruhutika Puram. In course of time it became Pithapuram. The old Purhuthika Peetha has been merged in the womb of time. After a long time Sri Ganapati Satchidananda Swami established Sri Padavallabha Anughadatta Kshetra at Agraharam with his help. Here you can see Sri Padavallaba Swamy, Ganesh Mandir and Sri Puruhutika Devi Mandir. After some time the residents of Pithapuram installed another idol of Sri Puruhutika Devi in the premises of Sri Kukkuteswara temple. Purhuthika Devi Mandir was also built as part of the renovation of Kukkuteswara Temple. Today, daily prayers, services and festival programs are organized for Purhuthika Devi. By visiting the Kshetra we can get the grace of Purhuthika Devi.
Buses like Kakinada - Tuni etc. are available from Peethapuram town. At the beginning of Peethapuram village (from Kakinada) there is a government hospital stop. From here the padagaya field will be near. Padagaya Raja Gopuram is located on Peethapuram - Samarlakota road. The entrance to the temple is from the Rajagopuram (another entrance is on the National Highway - Peethapuram Bypass). After passing the Rajagopuram, you will see Padagaya Koneru. There is a huge statue of Gayasura in the middle of Pushkarini.
The Howrah-Chennai railway has railway stations called Pithapuram and Samarlakota Junction. Some express trains stop at Pithapuram railway station. Autos are available for Padagaya temple from here. All major trains stop at Samarlakota railway station. Buses & sharing autos ply from here to Pithapuram. Samarlakota - Pithapuram transport services are via Padagaya Gudi. Kakinada - Tuni buses/sharing autos (Via) ply via Pithapuram & Kathipudi.
Google map: https://maps.app.goo.gl/jDZpx2Cs9pZyJAse8