గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

అద్దంపల్లి గ్రామం / ADAMPALLI VILLAGE

శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

వృషభరాశి, కృత్తిక నక్షత్రం (2వ పాదం)

పాద శివలింగ స్ధానం: ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 6 kms. దూరాన, అద్దంపల్లి గ్రామం (Addampalli)  కలదు. ఇచ్చట శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: ప్రాచీన ఆలయం చోళుల కాలం నాటిది. ప్రాచీన ఆలయం జీర్ణమైనది. దేవాదాయ శాఖ మరియు గ్రామస్ధుల సహాకారముతో పునః నిర్మాణం జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయం నందు శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి కొలువై యున్నాడు.  అంతరాలయం నందు గణపతి, నాగ బంధం దర్శనమిస్తాయి. ముఖ మండపం నందు నంది విగ్రహం మరియు ద్వారపాలకులు ఉంటారు. ఆలయ ప్రాంగణములో చండీశ్వరుడు గలడు.  ఆలయం నందు వివాహ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చర్మ వ్యాధులతో బాధ పడే వారికి శాంతులు జరిపించుతారు. పార్వతీ అమ్మ వారు మహిమల గల శక్తి స్వరూపిణి గా భక్తులు నమ్ముతారు

రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామం నకు సుమారు 4 Kms. దూరంలో ఎర్ర పోతవరం బస్ స్టాప్ ఉంటుంది. ఎర్ర పోతవరం  నుంచి అండ్రంగి గ్రామం కు రోడ్డు మార్గము కలదు. అండ్రంగి రోడ్డు లో అద్దంపల్లి గ్రామం ఉంటుంది.

ఎర్ర పోతవరం బ్రిడ్జి దిగువ నుంచి అద్దంపల్లి కు ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 2 Kms. ఎర్ర పోతవరం నుంచి అద్దంపల్లి వైపు పోవు ఆటోలు చాల తక్కువగా ఉంటాయి. కాబట్టి ద్రాక్షారామం నుంచి అద్దంపల్లి కి రాను - పోను ఆటో ఏర్పాట్టు చేసుకోవటం సౌక్యముగా ఉంటుంది.

అర్చక స్వామి: మాకు సహకరించిన అద్దంపల్లి అర్చక స్వామి, శ్రీ ఉండి ఉమామహేశ్వర వీరభద్రరావు, సెల్ నెం. 9666924683 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

కృత్తిక నక్షత్రం స్తోత్రం

అగ్నిమూర్ధాదివ: కకుత్పతి: పృథివ్యాయమమ్‌|

అపారేతా సిజన్వతి:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Description