గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
ఉప్పంగల గ్రామం / UPPANGALA VILLAGE
శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
మేషరాశి, భరణి నక్షత్రం (4వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 17 Kms. దూరన ఉప్పంగల (Uppangala ) గ్రామం ఉంటుంది. ఇచ్చట శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కలదు. ఉప్పంగల గ్రామం నుంచి కాపులపాలెం వైపు పోవు రోడ్డు మార్గములో శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. శ్రీ రామలింగేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: పల్లిపాలెం గ్రామం నకు ఆగ్నేయం దిశగా సుమారు రెండు Kms. దూరంలో ఉప్పంగల గ్రామం ఉంది. ఇది శ్రీ రామచంద్రుడు నడయాడిన ప్రదేశంగా ప్రతీతి. త్రేతాయగములో శ్రీరాముడు అరణ్యవాసం సందర్భముగా కొన్ని సంవత్సరాలు దండకారణ్యంలో గడిపాడు. గోదావరి నది పరిసర ప్రాంతంలో సీతా లక్ష్మణుల సమేతంగా కొంత కాలము రామచంద్రుడు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకనాడు రావణ బ్రహ్మ సహోదరి అయిన శూర్పణఖ రాముణ్ని చూసి ఇష్టపడింది. ఆ శూర్పణఖ పెళ్లి చేసుకోమనీ రాముడుని అడుగుతుంది. అప్పుడు రాముడు ఆమెను లక్ష్మణుడు వద్దకు పంపుతాడు. లక్ష్మణుడు కత్తితో శూర్పణఖ చెవులూ, ముక్కూ కోస్తాడు. ఆ చుప్పనాతి (శూర్పణఖ) శరీర అంగములు పడిన ప్రాంతము " చుప్పంగల " అనె పేరుతో పిలువబడింది. కాలక్రమేణా చుప్పంగల ప్రాంతము " ఉప్పంగల " గా మారింది. లక్ష్మణుడు వినియోగించిన కత్తిని, సమీపంలో గల చెరువులో కడిగినాడు. ఇప్పటికి ఆ చెరువు నీరు కొద్దిగా ఎర్రజీరతో కనిపిస్తుంది. శ్రీరాముడు దండకారణ్యంలో పాదచారై సంచురించు సమయంలో స్ధానిక చెరువులో సంధ్యావందనం గావించి, ఒక సైకత లింగ ప్రతిష్ట గావించినట్లు స్ధల పురాణం చెప్పుతుంది.
ఆలయ ప్రాంగణం విశాలముగా ఉంటుంది. ప్రవేశ ద్వారం దాటగానే ధ్వజస్తంభం, ముఖ మండపం, ద్వారపాలకులు, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయం నందు శ్రీ రామలింగేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామికి ఎడమ భాగమున పార్వతీ దేవి కొలువై ఉన్నాది. స్వామి వారికి నిత్య అభిషేకాలు, అర్చనలుతో పాటు నక్షత్ర దోషములకు అభిషేక శాంతులు నిర్వహించుతారు. అంతరాలయం నందు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీ దేవి విగ్రహములున్నాయి. నంది మండపం నందలి నంది విగ్రహమును చర (తిప్పుడు) నంది అని సంభోదించుతారు. గ్రామము లోని స్త్రీలు ప్రసవ సమయములో బిడ్డ అడ్డం తిరిగి, కాన్పు కష్టమయినప్పుడు ఆమె భర్త ఆలయం నందలి చర నందిని తన ఇంటి ముఖంగా తిప్పుతాడు. చర (తిప్పుడు) నంది చల్లని చూపుతో అతని భార్యకు సుఖ ప్రసవం జరుగుతుంది అని నమ్మకం.
రవాణా సమాచారం 1: ద్రాక్షారామం - యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, కుయ్యేరు, ఉప్పుమిల్లి , కోలంక, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి.
రవాణా సమాచారం 2: కాకినాడ - అమలాపురం (Non-Stop) బస్ సర్వీసులు direct గా యానాం బైపాస్ రోడ్ మీదగా ఉంటాయి.
రవాణా సమాచారం 3: యానాం బైపాస్ రోడ్ (Sri Ravi Junior & Degree College, Near Yanam Bi Pass Sunkarapalem, Andhra Pradesh) నుంచి ఉప్పంగల గ్రామం నకు ఆటోలు ఎక్కువుగా దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 2 kms. వీటిని (ఆటో) రాను - పోను ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది సౌక్యముగా ఉంటుంది.
అర్చక స్వామి: మాకు సహకరించిన ఉప్పంగల అర్చక స్వామి అయిన శ్రీ కొండూరి పార్వతీశ్వర రావు, సెల్ నెం. 9247889345 గార్కి నా నమసుమాంజలి.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
భరణి నక్షత్రం స్తోత్రం
యమాయ త్వాంగిరస్యతే పితృమతే స్వాహా స్వాహా|
ధర్మాయ స్వాహా ధర్యపుత్రే||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.
వీడియో వివరణ / Video Description
ఆడియో వివరణ / Audio Description