గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

వెలవలపల్లి గ్రామం / VELAVALAPALLI VILLAGE

శ్రీ మహిషాసురమర్ధని సమేత రాజరాజనరేంద్ర స్వామి

మకర రాశి, ధనిష్ఠ నక్షత్రం (1వ పాదం)


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా సుమారు 20 kms. దూరాన వెలవలపల్లి (Velavapalli) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ రాజరాజనరేంద్ర లింగమును దర్శించగలము. శ్రీ మహిషాసురమర్ధని సమేత రాజరాజనరేంద్ర స్వామి వారి ఆలయం ధనిష్ఠ నక్షత్రం (1వ పాదం) చెందినది. శ్రీ రాజరాజనరేంద్ర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ మహిషాసురమర్ధని సమేత రాజరాజనరేంద్ర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. అంతరాలయం నందు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు వీరభద్రుడుకొలువై యున్నారు. నవగ్రహ మంటపం కూడ కలదు. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ రాజరాజనరేంద్ర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ మహిషాసురమర్ధని సమేత రాజరాజనరేంద్ర స్వామి వారి కళ్యాణోత్సవములు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి నిర్వ హించబడతాయి. మకర రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: వీరవల్లిపాలెం నకు దక్షిణ దిశగా సుమారు 15 Kms. దూరాన అమలాపురం ఉంది. ఇది కోనసీమ జిల్లా కేంద్రం. అమలాపురం నుంచి వీరవల్లిపాలెం నకు ప్రతి 2 గంటలకు బస్సులు (Via) ముక్తేశ్వరం మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం: రావులపాలెం - అద్దంకి వారి లంక కు బస్సులు (Via) వాడపాలెం, ముక్తేశ్వరం, వీరవల్లిపాలెం మీదగా రోజుకు 2 బస్సులు ఉంటాయి.

* రావులపాలెం - వీరవల్లిపాలెం మధ్య దూరం సుమారు 26 Kms.

రవాణా సమాచారం: రావులపాలెం - మురమళ్ళ బస్సులు (Via) వాడపాలెం, వెలవలపల్లి, ముక్తేశ్వరం మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం: రావులపాలెం & కొత్తపేట నుంచి బయలు దేరిన అయినవిల్లి షేరింగ్ ఆటోలు (Via) వెలవలపల్లి మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం: కోటిపల్లి రేవు నుంచి ముక్తేశ్వరం రేవుకు Boat సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం రేవు నుంచి ముక్తేశ్వరం కు రవాణ సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం నుంచి వెలవలపల్లి కి ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 4 Kms.

అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ వెలవలపల్లి శంభేశ్వరరావు, సెల్ నెం: 98484 61968 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

ధనిష్ఠ నక్షత్రం స్తోత్రం

వసో: పవిత్రమసి శతధారం వసో: పవిత్రమసి సహస్రధారమ్‌|

దేవస్త్యా సవితా పునాత్‌ వసో: పవిత్రేణ శతధారేణ సుప్త్వా కామధుక్ష:

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Description