సంఘటనలు / Events

NFCL మూర్తి గారి ఆధ్వర్యంలో ది. 03.07.2022 ఆదివారము జరిగిన దక్షిణకాశీ శ్రీ దక్షారామం యాత్రకు అనూహ్య స్పందనతో 75 మంది భక్తులు

జై మాణిక్యాంబా సమేత భీమనాథాయ నమః

ప్రియ భగవత్ బంధువులారా, శ్రీ మాణిక్యాంబా సమేత భీమనాథుని అనుగ్రహంతో , NFCL మూర్తి గారి ఆధ్వర్యంలో ది. 03.07.2022 ఆదివారము జరిగిన దక్షిణకాశీ శ్రీ దక్షారామం యాత్రకు అనూహ్య స్పందనతో 75 మంది భక్తులు విచ్చేయడం మాకు ఆనందాన్ని కలుగ చేసింది. ఈ యాత్ర లో ముందుగా మీకు తెలియ చేసినట్లుగా ద్వాదశ తీర్థాలు పంచ తీర్థాలే కాకుండా అష్ట దిక్కులలో కల అమ్మవార్లను కూడా చూపిస్తూ ప్రతీచోటా వాటి విశిష్టతను మహిమనూ వివరిస్తూ అవకాశం వున్న చోట్ల స్పర్శ దర్శనములు కూడా చేయించడం జరిగింది. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా యాత్రను ఫలప్రదం చేసికొనినందులకు భక్తులందరికీ మాయొక్క అభినందనలు తెలియచేస్తున్నాము. ఆ మాణిక్యాంబ సమేత భీమ నాధుని అనుగ్రహం ఎల్లప్పుడూ అందరిపై వుండాలని ప్రార్ధిస్తున్నాము.

Events

ఆత్మీయ ఆహ్వానం

బ్రహ్మర్షి పితామహా పత్రీజీ ఆశీస్సులతో

భీమఖండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం లో భాగం గా "108 నక్షత్ర పాద శివాలయలలో" జులై 7 నుండి ఆగస్టు 2 తేదీ వరకు, 27 రోజులు జరిగే "శకహార -- ధ్యాన -- శాంతి -- సౌభాగ్య సాధన -- యాత్ర " గురించి విధి - విధానాలు చర్చించేందుకు ఈ సమావేశం, ది 1/7/22 శుక్రవారం సాయంత్రం 4 గం నుండి 6 గం " వరకు సమావేశం "ద్రాక్షారామ ధ్యాన కేంద్రం" నందు జరుగుతుంది. కాబట్టి ఆత్మీయలు అందరూ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావలసినదిగా కోరుచున్నాము.

స్థలం : ద్రాక్షారామ, శ్రీ భీమేశ్వరస్వామి గుడి, పడమటి గోపురం ప్రక్క, మేడపైనా...

ద్రాక్షారామ ధ్యాన మందిరం వివరాలు