గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

గురజనాపల్లి గ్రామం / GURAJANAPALLI VILLAGE

శ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ చెన్నమల్లేశ్వర  స్వామి

వృషభరాశి, మృగశిర నక్షత్రం (2వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 26 kms. దూరాన, గురజనాపల్లి గ్రామం (Gurajanapalli) కలదు. ఇచ్చట శ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ చెన్న మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: ఒకనాటి గురజనాపల్లి గ్రామం నందు శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయం ఉండేది. ప్రకృతి వైపరీత్యాలు వలన నాటి గురజనాపల్లి గ్రామం పూర్తిగా అగ్నికి అహుతి అయింది. ప్రాచీన ఆలయం నేల మట్టమయింది. దేవతా మూర్తులుకు నష్టం జరిగింది. ఆ బూడిద మీద మరల గురజనాపల్లి గ్రామం వెలిసింది. కొంత కాలము గడిచిన పిమ్మట గ్రామవాసులు ఆర్ధిక సహాయం తో మరో ఆలయం నిర్మించుట జరిగింది. నూతనముగా మరో దేవతా మూర్తులును ప్రతిష్టించారు. ఆ మూర్తులును శ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి గా  నామకరణం చేశారు. పిఠాపురం సంస్ధానం వారు ఆలయం కు భూములు దానం ఇచ్చారు. కాలక్రమేన శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి ఆలయం క్రమ క్రమముగా జీర్ణమైనది. గురజనాపల్లి గ్రామ ప్రజలు, దాతల సహాకారముతో 1997 సంవత్సరములో మరల చెన్న మల్లేశ్వర స్వామి ఆలయం పునర్మిర్నాణం చేశారు. దేవతా మూర్తులుకు  పునః ప్రతిష్ట గావించారు.

ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభము, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయం నందు శ్రీ చెన్న మల్లేశ్వర లింగము దర్శనమిస్తుంది. అంతరాలయం నందు శ్రీ భ్రమరాంబికా దేవి, గణపతి, నాగ బంధం, అయ్యప్ప స్వామి కలరు. ముఖమండపం నందు నంది విగ్రహం ఉంటుంది. శ్రీ చెన్న మల్లేశ్వర స్వామికి నిత్య అర్చనలు, అభిషేకాలు జరగుచుంటాయి. ఇచ్చట స్వామి వారి కళ్యాణోత్సవం, గణపతి నవరాత్రులు, దేవి శరన్నవరాత్రులు, అయ్యప్ప స్వాముల దీక్షలు జరగుచుంటాయి.

ప్రతి మాసం మృగశిర నక్షత్రం సందర్భముగా లోక కళ్యాణం కోసం నక్షత్ర శాంతి అభిషేకాలు నిర్వహించుతారు.

రవాణా సమాచారం: కాకినాడ నుంచి యానాం బస్సులు (Via) జగన్నాధపురం బ్రిడ్జి, చొల్లంగి తీర్ధం, గురజనాపల్లి జంక్షన్, కోరంగి, తాళ్ళరేవు మీదగా ఉంటాయి. కాకినాడ - యానాం మరియు కాకినాడ - అమలాపురం (పల్లె వెలుగు) బస్సులు గురజనాపల్లి జంక్షన్ వద్ద ఆగుతాయి. దీనిని  గురజనాపల్లి బస్ స్టాప్ గా పిలుస్తారు. కాకినాడ RTC బస్ స్టాండ్ నుంచి గురజనాపల్లి జంక్షన్ దూరం సుమారు 8 Kms. గా ఉంటుంది. గురజనాపల్లి బస్ స్టాప్  నుంచి గురజనాపల్లి ఊరు దూరం సుమారు 2 Kms. గా ఉంటుంది.

* కాకినాడ లోని జగన్నాధపురం బ్రిడ్జి నుంచి గురజనాపల్లి ఊరు లోనికి షేరింగ్ ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 7 Kms. గా ఉంటుంది.

* కాకినాడ నుంచి కోటిపల్లి బస్సులు (Via) జగన్నాధపురం బ్రిడ్జి, నడకుదురు, గొల్లపాలెం, ద్రాక్షారామం మీదగా ఉంటాయి.

* కాకినాడ - కోటిపల్లి, కాకినాడ - రామచంద్రపురం మరియు  కాకినాడ - రావులపాలెం (పల్లె వెలుగు) బస్సులు (Via) నడకుదురు, గురజనాపల్లి బస్ స్టాప్ మీదగా ఉంటాయి.

నడకుదురు ఊరు దాటగానే గురజనాపల్లి రోడ్డు వద్ద బస్సులు ఆగుతాయి. దీనిని గురజనాపల్లి బస్ స్టాప్ (నడకుదురు) గా పిలుస్తారు. కాకినాడ RTC బస్ స్టాండ్ నుంచి గురజనాపల్లి రోడ్డు బస్ స్టాప్ దూరం సుమారు 8 Kms. గా ఉంటుంది.

కాకినాడ లోని జగన్నాధపురం బ్రిడ్జి నుంచి ద్రాక్షారామం మరియు రామచంద్రపురం వైపు పోవు షేరింగ్ ఆటోలు దొరుకుతాయి.

* నడకుదురు (గురజనాపల్లి రోడ్డు) నుంచి చొల్లంగి వైపు పోవు బ్రాంచి రోడ్డు మార్గములో గురజనాపల్లి గ్రామం ఉంటుంది. నడకుదురు (గురజనాపల్లి రోడ్డు) - చొల్లంగి (గురజనాపల్లి జంక్షన్) రోడ్డు మార్గం నందు శ్రీ భ్రమరాంబికా సమేత చెన్న మల్లేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. నడకుదురు (గురజనాపల్లి రోడ్డు) నుంచి ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 3 Kms. గా ఉంటుంది.

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన గురజనాపల్లి - శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ వెలవలపల్లి బాల కామేశ్వర శర్మ, సెల్ నెం. 9866396635 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

మృగశిర నక్షత్రం స్తోత్రం

ఇమం దేవా అసపత్నం సుబధ్వం మహతే క్షత్రాయ మహతే|

జ్యేష్ఠాయ మహతే జాన రాజ్యాయేంద్ర స్యేంద్రియాయ

ఇమముష్యౌ పుత్ర మముష్యా పుత్రము ముష్యా విశ

ఏషవోమీరాజా సోమోస్యాకం బ్రాహ్మణానా రాజా||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Description