గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

నీలపల్లి గ్రామం / NEELAPALLI

శ్రీ మీనాక్షీదేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి

మేషరాశి, కృత్తిక నక్షత్రం (1వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 21 kms. దూరాన యానాం అను పట్టణం కలదు. యానాం కు ఈశాన్యం దిశగా, సుమారు రెండు kms. దూరంలో నీలపల్లి గ్రామం ఉంటుంది. నీలపల్లి ఊరులో శ్రీ మీనాక్షీ దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీ నీలకంఠేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

పాత ఆలయం: శ్రీ నీలకంఠేశ్వర స్వామి పాత ఆలయం 15వ శతాబ్ధం నాటిది. విశాలమైన ప్రాంగణములో శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంతో పాటు శ్రీ మీనాక్షీ దేవి సన్నిధి, శ్రీ గణపతి సన్నిధిలు ఉండేవి. ప్రధానాలయం తూర్పున గల ధ్వజస్తంభం దివ్యముగా ఉండేది. ముఖమండపం నందు నందీశ్వరుడు, అంతరాలయం నందు గణపతి, ఉత్సవమూర్తులు, గర్భాలయం నందు  శ్రీ నీలకంఠేశ్వర లింగము దర్శనం మిచ్చేవి. స్వామికి నిత్య పూజలతో పాటు మాఘ శుద్ధ ఏకాదశికి కళ్యాణం జరుగుతూ ఉండేవి. శివరాత్రి, కార్తీక మాసంలో విశేష పూజలు నిర్వహించేవారు. గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు వైభవంగా జరుగుతూ ఉండేవి.

కొత్త ఆలయం: పాత ఆలయం శిథిలమవటంతో, ఆలయాన్ని నిర్మూలించి, నూతన ఆలయం నిర్మించాలని సంకల్పించారు. కమిటీ వారు ఆలయం పునర్నిర్మాణము చేపట్టినారు. దేవాదాయ శాఖ మరియు గ్రామస్ధుల ఆర్ధిక సహాయంతో నూతన ఆలయంను బహు సుందరంగా నిర్మించారు. ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ప్రధానాలయం నకు తూర్పు వైపున నంది మండపం, ధ్వజస్తంభం ఉంటాయి. విశాలమైన ముఖ మండపం నందు శ్రీ మీనాక్షి అమ్మ వారి సన్నిధి దక్షిణాభి ముఖంగా నిర్మాణం జరిగింది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి కోసం అంతరాలయం, గర్భాలయం తూర్పు అభిముఖంగా నిర్మాణం చేసారు. ఆలయ ప్రాంగణములో ఈశాన్యం మూల నవగ్రహమండపం, ఆగ్నేయం నందు అయ్యప్ప సన్నిధి, నైఋతి ప్రక్కన గణపతి సన్నిధి మరియు వాయువ్యం వైపున శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి ఉంటాయి. ఉత్తరం వైపున చండీశ్వర స్వామి సన్నిధి ఉంటుంది.

నీలపల్లి (Neelapalli) గ్రామం నకు నైఋతి దిశగా, సుమారు రెండు Kms. దూరం లో యానాం అను పట్టణం కలదు. ఇది పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం పరిధి లోనికి వస్తుంది. యానాం ప్రధాన కేంద్రం పాండిచ్చేరి. పూర్వం పాండిచేరి (Pandichery) అని పిలిచేవారు. తమిళనాడు రాష్రం లోని పాండిచ్చేరి (Puducherry), కరైకళ్ (Karaikal) మరియు ఆంధ్రప్రదేశ్ లోని యానాం (Yanam) కలసి పుదుచ్చేరి భారత కేంద్ర భూభాగంగా (Indian Union Territory) పిలుస్తారు. యానాం ప్రాంతము 1954 లో ఫ్రాన్స్ నుండి భారతదేశానికి ఇవ్వబడినా ఫ్రెంచి యానాం గా గుర్తింపు ఉంది.

యానాం ప్రాంతము 1723లో ఫ్రెంచి పాలనలోకి వెళ్ళింది. మొగలు సామ్రాజ్యాధిపతులు వద్ద నుండి ఫ్రెంచి వారు ఒక ఫర్మానా అధికారాన్ని పొందారు. ఫ్రెంచి వారు తమ అంగీకారమును ఇనాంల రూపంలో తెలిపారు. ఆ ఇనాం కాస్తా ఫ్రెంచివారి చేతులలో యానాంగా మారిపోయింది. యానాం ప్రాంతముకు ఉత్తర దిశగా నీలపల్లి గ్రామం ఉంది. భారత స్వాతంత్ర్యం ముందు నీలపల్లి గ్రామం ఆంగ్లేయుల పాలనలో ఉండేది. 18వ శతాబ్దంలో అడపాదడపా ఆంగ్లేయుల పాలనలోకి యానాం ప్రాంతము వెళ్ళేది. 1750లో హైదరాబాదు నిజాము నవాబు ముసాఫర్ జంగ్, ఫ్రెంచి వారి వాదనలను అంగీకరిస్తూ ఆంగ్లేయుల ఈ ప్రదేశమును (యానాం) ఫ్రెంచి వారికి అప్పగించారు. అప్పటి నుంచి 1954 వరకు ఫ్రెంచి వారి ఆధీనంలో యానాం ప్రాంతము ఉండేది. భారత స్వాతంత్ర్యం తరువాత నీలపల్లి గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని ఒక భాగం అయింది.

పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం అయిన యానాం ప్రాంతము కు మూడు దిక్కుల యందు ఆంధ్రప్రదేశ్ భూభాగం మరియు తూర్పు దిక్కున బంగాళాఖాతం ఉంటుంది. యానాం ప్రాంతములో నివసించే జనాభాలో చాలామంది తెలుగు మాట్లాడతారు. Google Map లో నీలపల్లి గ్రామంను పాండిచ్చేరి భూభాగంగా చూపుతోంది.

రవాణా సమాచారం 1: రాజమండ్రి - యానాం బస్సులు (Via) రామచంద్రాపురం, ద్రాక్షారామం, కుయ్యేరు, కోలంక, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. 

రవాణా సమాచారం 2: యానాం బస్ స్టాండ్ నుంచి  యానాం - కాకినాడ (పల్లె వెలుగు) బస్ సర్వీసులు నీలపల్లి మీదగా ఉంటాయి. నీలపల్లి బస్ స్టాప్ (Jammi Chettu Center Stop) నుంచి శ్రీ నీలకంఠేశ్వరాలయంకు ఆటో లేదా నడక ద్వార చేరగలము. వీటి మధ్య దూరం కేవలం 850 meters మాత్రమే.

అర్చక స్వామి: మాకు సహకరించిన నీలపల్లి అర్చక స్వామి శ్రీ కంఠం భీమేశ్వర రావు, సెల్ నెం. 88853 68933 & శ్రీ కంఠం సత్యనారాయణ సెల్ నెం. 9618741362 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

కృత్తిక నక్షత్రం స్తోత్రం

అగ్నిమూర్ధాదివ: కకుత్పతి: పృథివ్యాయమమ్‌|

అపారేతా సిజన్వతి:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Description