గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

పెనికేరు గ్రామం / PENIKERU VILLAGE

శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత ఇష్టకాంతేశ్వర స్వామి

వృశ్చికరాశి, అనురాధ నక్షత్రం (1వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి పశ్చిమ దిశగా, సుమారు 30 kms. దూరాన పెనికేరు (Penikeru) అను గ్రామం కలదు. మండపేట - ఆలమూరు రోడ్డు మార్గములో కొత్తూరు సెంటర్ ఉంటుంది. కొత్తూరు సెంటర్ బస్ స్టాప్ కు వాయువ్యం దిశగా సుమారు 02 Kms. దూరంలో (లోపలకి) పెనికేరు గ్రామం కలదు. ఇచ్చట శ్రీ ఇష్టకాంతేశ్వర లింగమును దర్శించగలము. ఇది వ్యాస ప్రతిష్టగా ప్రతీతి. శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత ఇష్టకాంతేశ్వర స్వామి వారి ఆలయం అనురాధ నక్షత్రం (1వ పాదం) చెందినది. శ్రీ ఇష్టకాంతేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

స్ధల పురాణం: ఒకనాడు వ్యాస మునిని పరిశీలించాలని కాశీ విశ్వేశ్వరుడు అనుకున్నాడు. దాని ఫలితంగా కాశీ పురంలో వ్యాస మునికి, అతని శిష్యులుకు భిక్షం దొరకలేదు. శిష్యుల ఆకలి భాద చూడలేక కాశీ పురం నకు శాపం ఇవ్వడానికి వ్యాస మహర్షి సిద్ధపడ్డాడు. అప్పుడు అన్నపూర్ణదేవి వ్యాస పరివారం నకు భోజనం ప్రసాధించుతుంది. సంతృప్తి చెందిన వ్యాసుని మరియు అతని శిష్యులను కాశీని విడిచిపెట్టమని కాశీ మాత ఆదేశించుతుంది. అన్నపూర్ణదేవి మాటకు వ్యాస ముని దుఖీఃచాడు. ఆ సమయం లో విశ్వేశ్వరుడు వ్యాసునితో ఇట్లు పలికెను " ఓ మహర్షి కాశీతో సమానమైన ద్రాక్షరామానికి వెళ్ళు " అని సలహా ఇచ్చాడు. శివాజ్ఞ ప్రకారం దక్షిణ కాశీ అయిన ద్రాక్షారామం నకు వ్యాసు మహర్షి చేరుకొంటాడు. అప్పటికే దక్షిణ ప్రాంతము చేరుకున్న అగస్త్యుడు (మహర్షి) ద్రాక్షారామ పరిసర ప్రాంతాలను (భీమమండలము) వ్యాసుడుకి పరిచయం చేస్తాడు. వ్యాసుడు తన తపస్సు మహిమతో ఆకాశ ప్రయాణం లో భీమమండలము సందర్శించినాడు. వ్యాసుడు యాత్రలో పెనికేరు క్షేత్రం ఉండుట విశేషం. పెనికేరు ప్రాంతములో వ్యాసుడు ఒక నిద్ర చేస్తాడు. సూర్యోదయం జరిగిన తరువాత వ్యాసుడు తన తపోశక్తితో ఒక శివ లింగమును సృష్టించి, దానిని ప్రతిష్టించాడు. శివ లింగము నకు ఇష్టకాంతేశ్వర స్వామిగా నామకరణం గావించి మరియు సేవించాడు. వ్యాసుడు సందర్శించిన ఆకాశ భీమమండల యాత్రని శ్రీనాథుడు భీమేశ్వరపురాణం నందు గొప్పగా వర్ణించాడు.

ఆలయం: పెనికేరు గ్రామం లోని శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత ఇష్టకాంతేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. నేటి ఆలయం శిథిలావస్దకు చేరుకోబోతుంది. గ్రామస్ధులు, దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి.

ప్రాచీన ఆలయాలు పునరుద్ధరించి, ముందు తరాలకు కానుకగా అందించాలి. ఆలయ ప్రాంగణము విశాలముగా ఉంటుంది. ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయం నకు తూర్పున ధ్వజస్ధభం, ఆగ్నేయ మూల హోమ గుండం, వాయువ్య మూల వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, చర నంది, ప్రాచీన మూర్తులు ఉంటారు. మండపం పైన గణపతి & శివాకృతి ఉన్నారు. ఉత్తర వైపున నాగబంధం కలదు. ముఖ మండపం నందు నందీశ్వరుడు ఉంటాడు. అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి మూర్తులు చిన్న చిన్న గూటిలో కొలువైయున్నారు. అంతరాలయం నందు గణపతి స్వామి కొలువైన్నాడు. గర్భాలయం నందు శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత ఇష్టకాంతేశ్వర స్వామి దర్శనమిస్తారు. స్వామి వామ భాగం నందు శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి కొలువుదీరింది. అమ్మ స్వయంభూ మూర్తి.

పెనికేరు వెలసిన శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి గొప్ప మహిమ గల వానిగా నిత్యాభిషేకములతో విరాజిల్లుతూ భక్తుల కోరికలు తీరుస్తూ భక్త వత్సలుడైనాడు. స్వామి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి. భక్తులు ఒక మండలం (41 రోజులు) శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామిని సేవించి, ఆరాధించుట వలన వారి ఇష్ట కార్యములు సిద్ధించ గలవు అని ఒక గట్టి నమ్మకం అనాది నుంచి ఉంది. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం చైత్ర బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. కార్తీక మాసంలో లక్ష రుద్రాక్షల పూజ / లక్ష బిల్వ పత్ర పూజ నిర్వహించుతారు. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి. మహాశివరాత్రి నాడు కోటిదీపోత్సవం నిర్వహించుతారు. సంక్రాంతి, తొలి ఏకాదశి, దీపావళీ, సుబ్రహ్మణ్య షష్టి మొదలగు పర్వదినాలు సందర్భముగా పూజలు విశేషంగా జరుగుతాయి.

శ్రీ ఇష్టకాంతేశ్వర లింగము, అనురాధ నక్షత్రం (1వ పాదం) చెందినది. అనురాధ నక్షత్రం నందలి 1వ పాదము లో జన్మించిన వారికి ఆలయం నందు అభిషేక శాంతులు నిర్వహించుతారు.

రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి రాజమండ్రి బస్సులు (via) రామచంద్రపురం, మండపేట మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం: మండపేట (కలువ పువ్వు సెంటర్) నుంచి పెనికేరు గ్రామం నకు (via) గుమ్మిలేరు, కొత్తూరు సెంటర్ మీదగా ఆటోలు దొరుకుతాయి. మండపేట నుంచి పెనికేరు గ్రామం దూరం సుమారు 11 Kms. గా ఉంటుంది.

రవాణా సమాచారం: కాకినాడ - రావులపాలెం బస్సులు (via) కరప, రామచంద్రపురం, మండపేట, గుమ్మిలేరు, కొత్తూరు సెంటర్ మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం: కొత్తూరు సెంటర్ నుంచి పెనికేరు గ్రామం నకు ఆటోలు ఉంటాయి. కొత్తూరు సెంటర్ నుంచి పెనికేరు గ్రామం దూరం సుమారు 02 Kms. గా ఉంటుంది.

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన పెనికేరు - శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ పుల్లేటికుర్తి సాంబ శివశర్మ (దొరబాబు), సెల్ నెం. 9866486437 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

అనురాధ నక్షత్రం స్తోత్రం

నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహోదేవాయత దృత్‌|

సపర్యత్‌ దూర్‌ దేశే దేశే దేవ జాతాయ కేతవే

దివసు పుత్రాయ సూర్యాయశ్‌ సత్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

చిత్త నక్షత్రం స్తోత్రం

త్వష్టా తురీయో అద్భుత ఇంద్రాగ్నీ పుష్టిర్వర్ధనమ్‌|

ద్విపద ఛందా ఇంద్రాయముక్షా గౌత్ర వయోదధ:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.