గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
కాపవరం గ్రామం / KAPAVARAM
శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి
కర్కాటకరాశి, పుష్యమి నక్షత్రం (1వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తర - ఈశాన్యం దిశగా, సుమారు 14 kms. దూరాన, కాపవరం (Kapvaram) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ వీరేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైది. కాల క్రమములో గ్రామస్తుల సహాయంతో శివాలయం పునర్నార్మించారు. ఆలయ ప్రాంగణము చాల విశాలముగా ఉంటుంది. ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో ప్రధానాలయంతో పాటు ధ్వజస్తంభం, చండీశ్వరుడు, రామాలయం మొదలగునవి ఉంటాయి. ముఖ మండపం నందు నందీశ్వరుడు, ద్వారపాలకులు ఉంటారు. వీరితో పాటు గణపతి, నటరాజ స్వామి, గజలక్ష్మీ ప్రతిమలను చూడగలము. అంతరాలయం నందు చిన్న నంది విగ్రహం, గణపతి కలరు. గర్భాలయంలో శ్రీ వీరేశ్వర లింగము మరియు శ్రీ భద్రకాళి అమ్మవారు ఏక పీఠం పైన కొలువైయున్నారు. స్వామిని సేవించిన వారు విశేష ఫలాలను పొందగలరు అని భక్తుల విశ్వాసం. స్వామి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణము జరుపుతారు. గ్రామోత్సవం అనంతరం, గ్రామ స్త్రీలు స్వామికి ఆవు పెరుగును నైవేద్యంగా సమర్పించుతారు. కార్తీక బహుళ అష్టమి/నవమి తిధి, శనివారం నాడు లక్ష పత్రి పూజ నిర్వహించుతారు.
శరన్నవరాత్రులు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి. రాత్రి లింగోద్భవ అభిషేకాలు కూడ ఉంటాయి. శ్రావణ మాసంలో సామి వారికి శాంతి కళ్యాణం, అమ్మవారికి శాకాంబరి అలంకారము జరుపుతారు. సంక్రాంతి, దీపావళీ మొదలగు పర్వదినాలు సందర్భముగా పూజలు విశేషంగా ఉంటాయి. ప్రతి పౌర్ణమి నాడు శ్రీ భద్రకాళి అమ్మవారికి అభిషేకాలు, కుంకమార్చనలు నిర్వహించుతారు.
నంది మండపం నందలి నంది విగ్రహమును చర (తిప్పుడు) నంది అని సంభోదించుతారు. గ్రామము లోని స్త్రీలు ప్రసవ సమయములో బిడ్డ అడ్డం తిరిగి, కాన్పు కష్టమయినప్పుడు ఆమె భర్త ఆలయం నందలి చర నందిని తన ఇంటి ముఖంగా తిప్పుతాడు. చర (తిప్పుడు) నంది చల్లని చూపుతో అతని భార్యకు సుఖ ప్రసవం జరుగుతుంది అని నమ్మకం. నక్షత్ర శాంతి కోసం ఆలయ అర్చక స్వామి: శ్రీ దెందులూరి రామభద్రి రాజు శర్మ. సెల్ నెం.9182096125 సంప్రదించగలరు.
రవాణా సమాచారం 1: రామచంద్రపురం నుంచి గోల్లపాలెం మీదగా కాకినాడ కు మరో రోడ్డు మార్గం ఉంది. పూర్వం ఈ మార్గము లో ప్రవేటు బస్సులు ఉండేవి. ఇప్పుడు బస్సులు ఉండవు. రాజగోపాల సెంటర్ (రామచంద్రపురం), వెల్ల, కాపవరం సెంటర్, ఉండూరు బ్రిడ్జి, జగన్నాధగిరి, గోల్లపాలెం, నడకుదురు మీదగా రోడ్డు ఉంటుంది. వెల్ల గ్రామం - ఉండూరు బ్రిడ్జి మధ్య కాపవరం సెంటర్ ఉంటుంది. కాపవరం సెంటర్ నుంచి వేళంగి గ్రామం నకు పోవు రోడ్డు మార్గములో కాపవరం గ్రామం ఉంటుంది. కాపవరం సెంటర్ నుంచి కాపవరం గ్రామం మధ్య దూరం ఒక Km. గా ఉంటుంది.
రవాణా సమాచారం 2: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 6 kms. దూరంలో రాజగోపాల సెంటర్ (రామచంద్రపురం) ఉంటుంది. ద్రాక్షారామం నుంచి బస్సులు / ఆటోలు దొరుకుతాయి.
రాజగోపాల సెంటర్ నుంచి వెల్ల గ్రామం కు ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 4 Kms.
రవాణా సమాచారం 2: వెల్ల గ్రామం లో ఆటోలు ఉంటాయి. కాపవరం నకు రాను- పోను ఆటో ఏర్పాట్టు చేసుకోవాలి. వీటి మధ్య దూరం సుమారు 4 Kms.
అర్చకస్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన కాపవరం - శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వరాలయం అర్చక స్వామి అయిన శ్రీ దెందులూరి రామభద్రి రాజు శర్మ. సెల్ నెం.9182096125 గార్కి నా నమసుమాంజలి.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
పుష్యమి నక్షత్రం స్తోత్రం
బృహస్తే అతి యం దర్యో అర్హాద్ ధుమదూ విమాతి కృతు మజ్జనేషు|
యదీదయచ్ఛ వసరుతు ప్రజాత్ తదసమాసు ద్రవిణం ఘోహి చింతమ్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.