గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

పెదపూడి గ్రామం / PEDAPUDI VILLAGE

శ్రీ శ్యామలాంబ సమేత  శ్రీ సోమేశ్వర స్వామి

కర్కాటకరాశి, ఆశ్లేష నక్షత్రం (2వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 27 kms. దూరాన పెదపూడి గ్రామం (Pedapudi) కలదు.  రామచంద్రపురం - సామర్లకోట రోడ్డు మార్గములో గొల్లల మామిడాడ జంక్షన్ ఉంటుంది. గొల్లల మామిడాడ జంక్షన్ కు తూర్పు-ఈశాన్యం దిశగా సుమారు 7Kms. దూరంలో పెదపూడి గ్రామం ఉంటుంది.  గొల్లల మామిడాడ జంక్షన్ నుంచి కాకినాడ కు రోడ్డు మార్గము ఉంది. కాకినాడ రోడ్డు మార్గములో పెదపూడి గ్రామం తాలుకా MRO office దాటిన తర్వాత శ్రీ శ్యామలాంబ సమేత  శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వస్తుంది. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: పెదపూడి గ్రామం లోని శ్రీ శ్యామలాంబ సమేత  శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది.  ఆలయ ప్రవేశం గాలిగోపురం క్రింద నుంచి జరుగుతుంది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, వినాయకుడు, నందీశ్వరుడు, ప్రధానాలయం, చండీశ్వరుడు నవగ్రహ మండపం మొదలగునవి ఉంటాయి.  ముఖమండపం నందు చిన్న నంది విగ్రహం, ద్వారపాలకులు ఉంటారు.  అంతరాలయం నందు వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తారు. గర్భాలయం నందు శ్రీ సోమేశ్వర లింగము మరియు శ్రీ శ్యామలాంబ దేవి కొలువుదీరినారు. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది.

శ్రీ సోమేశ్వర లింగము, ఆశ్లేష నక్షత్రం (2వ పాదం) చెందినది. ఆశ్రేష నక్షత్రం నందలి 2వ పాదము లో జన్మంచిన శిశువునకు మరియు ధనమునకు దోషం కలుగను. ఆలయం నందు ఆశ్లేష నక్షత్రం (2వ పాదం) నందు జన్మించిన వారికి శాంతులు నిర్వహించుతారు.

ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి. తిరునాళ్ళ, జాగరణ వైభవంగా ఉంటుంది.

నక్షత్ర శాంతి కోసం ఆలయ అర్చక స్వామి: శ్రీ కొమాళ్ళపల్లి సత్య వీరవెంకట్రావు, సెల్ నెం. 9959039975 సంప్రదించగలరు.

రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 8 kms. దూరంలో రామచంద్రాపురం bus complex ఉంటుంది. ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురం కు బస్సులు / ఆటోలు దొరుకుతాయి.

రవాణా సమాచారం 2: రామచంద్రాపురం బస్ స్టాండ్ నుంచి సామర్లకోట బస్సులు ప్రతి గంటకు ఉంటాయి. బస్ సర్వీసులు చోడవరం, నరసాపురపు పేట, గొల్లల మామిడాడ, బిక్కవోలు మీదగా ప్రయాణం చేస్తాయి.

రవాణా సమాచారం 3: గొల్లల మామిడాడ నుంచి పెదపూడి గ్రామం నకు షేరింగ్ ఆటోలు దొరుకుతాయి. ఆటోలు రాను - పోను ఏర్పాట్టు చేసుకోవడం సౌక్యముగా ఉంటుంది. గొల్లల మామిడాడ - పెదపూడి మధ్య దూరం సుమారు 7 Kms,

రవాణా సమాచారం 4: కాకినాడ - గొల్లల మామిడాడ ఆటోలు (via) ఇంద్రపాలెం, కొవ్వాడ, రామేశ్వరం, దోమాడ, పెదపూడి మీదగా ఉంటాయి.  కాకినాడ - పెదపూడి మధ్య దూరం 14 Kms. గొల్లల మామిడాడ ఆటోలు కాకినాడ బాల చెరువు నుంచి బయలుదేరుతాయి.

పెదపూడి గ్రామం నకు సమీప రైల్వే స్టేషన్స్ సామర్లకోట జంక్షన్.

రవాణా సమాచారం 5: విశాఖపట్నం - విజయవాడ రైలు మార్గములో  సామర్లకోట జంక్షన్ అను రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ అన్ని ముఖ్య రైలు సర్వీసులు ఆగుతాయి. సామర్లకోట రైల్వే స్టేషన్ కు ఎదురుగా APSRTC బస్ స్టాండ్ ఉంటుంది.

రవాణా సమాచారం 6: సామర్లకోట నుంచి పెదపూడి గ్రామం నకు ఆటోలు (via) వెట్లపాలెం మీదగా బయులుదేరుతాయి. వీటి మధ్య దూరం 14 Kms.  ఆటోలు రాను - పోను ఏర్పాట్టు చేసుకోవడం సౌక్యముగా ఉంటుంది. 

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన పెదపూడి - శ్రీ సోమేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కొమాళ్ళపల్లి సత్య వీరవెంకట్రావు, సెల్ నెం. 9959039975 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.  దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

ఆశ్లేష నక్షత్రం స్తోత్రం

నమోస్తు సర్వేభ్యో యేకేచ పృధివీభను: యే అంతరిక్షే|

యే దివి తేభ్య: సర్వేభ్యో నమ:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.